పండుగ సీజన్‌లో కార్లు.. అదిరిపోయే ఆఫర్లు.. రూ.2.5 లక్షల వరకు తగ్గింపు

పండుగ సీజన్‌లో కార్లు.. అదిరిపోయే ఆఫర్లు.. రూ.2.5 లక్షల వరకు తగ్గింపు
పండుగ సీజన్‌ని మరింత సంతోషంగా మార్చేందుకు ఈ కొత్త ఆఫర్లు తీసుకొస్తున్నామని హోండా కార్స్

వేలల్లో జీతం వస్తుంటే లక్షలు పెట్టి కారెట్లా కొనాలి.. ఈఎంఐ కట్టుకోవచ్చని కంపెనీలు చెబుతున్నా కారు కొనాలనే కల కలగానే మిగిలిపోతుంటుంది చాలా మందికి. పండుగ సీజన్ ఆఫర్లు కూడా వాహన ప్రియులను ఊరిస్తుంటాయి. ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా వినియోగ దారులను ఆకర్షించేందుకు అదిరిపోయే ఆఫర్లను ప్రవేశ పెట్టింది. హోండా కార్స్ తాజాగా గ్రేట్ హోండా ఫెస్ట్ పేరుతో ఫెస్టివల్ ఆఫర్లకు తెరతీసింది. కారు కొనుగోలు చేయాలని భావించే వారికి పలు రకాల ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న హోండా డీలర్ షిప్స్ వద్ద పండుగ ఆఫర్లు పొందొచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. పండుగ సీజన్‌ని మరింత సంతోషంగా మార్చేందుకు ఈ కొత్త ఆఫర్లు తీసుకొస్తున్నామని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) రాజేశ్ గోయల్ తెలిపారు. ఇందులో స్మార్ట్ ఫైనాన్స్ ఆప్షన్స్, ఈజీ ఈఎంఐ, ఎక్కువ కాలం టెన్యూర్ వంటి సౌలభ్యాలు అందుబాటులో ఉన్నాయి.

అలాగే హోండా అమేజ్ కారు కొంటే ఏకంగా రూ.47 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. హోండా సిటీ 5 జనరేషన్ కారుపై రూ.30 వేల వరకు, హోండా జాజ్ కారుపై రూ.40 వేల వరకు, హోండా డబ్ల్యూఆర్ వీ మోడల్‌పై రూ.40,000 వరకు, హోండా సివిక్ కారుపై రూ.2.5 లక్షల వరకు తగ్గింపు పొందొచ్చు. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌టెండెంట్ వారంటీ, హోండా కేర్ మెయింటినెన్స్ ప్రోగ్రామ్, ఎక్సేంజ్ డిస్కౌంట్ల రూపంలో ఈ తగ్గింపు లభిస్తుంది. ఇక బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కారు ధరకు 100 శాతం ఫైనాన్స్ అందిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story