Karnataka: రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యే తనయుడు

Karnataka: రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యే తనయుడు
Karnataka: కర్ణాటకలో ఎమ్మెల్యే తనయుడి లంచావతారం బయటపడింది. టెండరు ఇప్పిస్తానంటూ ఓ కాంట్రాక్టర్ నుంచి 40 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు బీజేపీ ఎమ్మెల్యే తనయుడు.

Karnataka: కర్ణాటకలో ఎమ్మెల్యే తనయుడి లంచావతారం బయటపడింది. టెండరు ఇప్పిస్తానంటూ ఓ కాంట్రాక్టర్ నుంచి 40 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు బీజేపీ ఎమ్మెల్యే తనయుడు. అనంతరం అతడి ఇంట్లో సోదాలు చేపట్టిన అధికారులు.. సుమారు 6 కోట్ల నోట్ల గుట్టలను గుర్తించారు. కర్ణాటక లోని దావణగెరె జిల్లా చెన్నగిరి ఎమ్మెల్యే మాడాళు విరూపాక్షప్ప తనయుడు ప్రశాంత్.. ముడి వస్తువుల కొనుగోలుకు టెండరు ఇప్పిస్తానంటూ ఒక గుత్తేదారు నుంచి 40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు దొరికిపోయాడు. బెంగళూరు జలమండలిలో చీఫ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న ప్రశాంత్‌.. ఈ టెండరు విషయంలో 80 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారనేది ప్రధాన ఆరోపణ. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు లోకాయుక్త అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. వారు ప్రశాంత్‌ కార్యాలయంపై ఆకస్మిక దాడి చేశారు. ఇక్కడ లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్న అధికారులు అతడి నివాసానికి వెళ్లి సోదాలు నిర్వహించారు.

కర్ణాటక సోప్స్‌ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ కు ఎమ్మెల్యే విరూపాక్షప్ప ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్‌ను అధికారులు ఈ కార్యాలయంలోనే అరెస్టు చేశారు. మూడు బ్యాగుల్లో రూ. 2.2 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తాజాగా ఆయన ఇంట్లో రూ. 6 కోట్లు గుర్తించినట్లు చెప్పారు. తాజా ఘటన బీజేపీని ఇరకాటం పడేసింది. కుమారుడు లంచం కేసులో చిక్కుకోవడంతో విరూపాక్షప్ప KSDL ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. KSDL కార్యాలయంలోనే లంచం డబ్బును లోకాయుక్త అధికారులు స్వాధీనం చేసుకోవడంతో.. బీజేపీ ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దాంతో ఆయన రాజీనామా చేయకతప్పలేదు.

Tags

Read MoreRead Less
Next Story