Omicron : ఒమిక్రాన్ సోకిన వారిలో 90% ఇవి కామన్.. !

Omicron : ఒమిక్రాన్ .. ఇప్పుడు ప్రపంచదేశాలను వనికిస్తోన్న వేరియంట్.. క్రమంగా ఈ వైరస్ వ్యాప్తి మనదేశంలో కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు భారత్‌లో 415 కేసులు నమోదు కాగా 115 మంది కోలుకున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ వైరస్ సోకిన వారిలో అధిక శాతం మందిలో ఎలాంటి లక్షణాలూ కనబడకపోవడం, ఒకవేళ కొందరిలో కనిపించినా ఈ వేరియంట్ ప్రభావం స్వల్పంగానే ఉంటున్నాయట.. ఢిల్లీకి చెందిన వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఒమిక్రన్ సోకినప్పటికి భాదితులు త్వరగానే కోలుకుంటున్నారని, తీవ్రమైన లక్షణాలేవి కూడా వారిలో కనిపించడం లేదని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సురేష్ తెలిపారు. దాదాపు 90శాతం కేసుల్లో మాత్రం ఎలాంటి లక్షణాలూ లేకపోవడం, వాళ్లకు చికిత్సలు కూడా అందించాల్సిన అవసరంలేకపోవడం ఊరటనిచ్చే అంశమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య 415కు చేరింది. ఇప్పటివరకూ 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ విస్తరించింది. వీరిలో ఇప్పటివరకూ 115 మంది రికవరీ అయ్యారు. అత్యధికంగా మహారాష్ట్రలో 108 మంది ఒమక్రాన్ బారిన పడగా..వీరిలో 42 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తర్వాత ఢిల్లీలో 73, గుజరాత్‌లో 43, తెలంగాణలో 38 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. కేరళలో 37, తమిళనాడు 34, కర్ణాటకలో 31 మందిని ఒమిక్రాన్ బాధితులుగా గుర్తించారు. రాజస్థాన్‌లో 22 మందికి ఒమిక్రాన్ సోకింది. హర్యాణ,ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 4 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com