Crime News: వింత దొంగలు.. రూ.17 లక్షల విలువ చేసే చాక్లెట్ బార్లను దొంగిలించారు..

Crime News: లక్నో గోడౌన్‌లో రూ. 17 లక్షల విలువైన చాక్లెట్ బార్లను దొంగలు దొంగిలించుకుపోయారు. దొంగలు దాదాపు 150 కార్టన్‌ల చాక్లెట్ బార్‌లతో పాటు కొన్ని బిస్కెట్ల బాక్సులను అపహరించారు. చాక్లెట్ దొంగలు సీసీటీవీల డిజిటల్ వీడియో రికార్డర్‌ను కూడా ఎత్తుకెళ్లారు.
లక్నోలోని చిన్‌హాట్ ప్రాంతంలో ఓ ప్రముఖ బ్రాండ్‌కు చెందిన దాదాపు రూ.17 లక్షల విలువైన చాక్లెట్ బార్‌లను గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ గోడౌన్ నగరంలో బహుళజాతి చాక్లెట్ బ్రాండ్ పంపిణీదారు అయిన వ్యాపారవేత్త రాజేంద్ర సింగ్ సిద్ధుకి చెందినది.
ఇటీవలే తాను చిన్‌హట్‌లోని పాత ఇంటి నుంచి గోమతి నగర్‌లోని విభూతి ఖండ్‌లోని అపార్ట్‌మెంట్‌కు మారినట్లు పోలీసులకు సిద్ధూ తెలిపారు. తన పాత ఇంటిని చాక్లెట్లు నిల్వ చేసుకునేందుకు గోడౌన్‌గా వాడుకుంటున్నట్లు చెప్పాడు. మంగళవారం, చిన్‌హట్‌లోని పొరుగువారి నుండి అతనికి కాల్ వచ్చింది, ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నాయని అతనికి సమాచారం ఇచ్చారు.
దీంతో ఇంటికి వెళ్లి చూస్తే గోడౌన్ మొత్తం ఖాళీగా ఉంది. చాక్లెట్ బాక్సులన్నీ దొంగలు ఎత్తుకెళ్లారు. సీసీటీవీల డిజిటల్ వీడియో రికార్డర్‌ను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. విలువైన వస్తువులను దోచుకున్నారు. ఇదంతా గోడౌన్‌లో పనిచేస్తు్న్న ఉద్యోగుల పనే అయి ఉంటుందని సిద్దు తెలిపారు.
"రాత్రి పికప్ ట్రక్కు సౌండ్ వినిపించిందని, స్టాక్‌ని తీసుకెళ్లడానికి వచ్చి ఉంటారని భావించానని గోడౌన్‌కు సమీపంలో నివసిస్తున్నవారు తెలిపారు. ఓ ట్రక్కు తీసుకువచ్చి మరీ స్టాక్ అంతా వేసుకెళ్లినట్లు సిద్ధూ పోలీసులకు తెలిపారు. రెండ్రోజుల క్రితమే స్టాక్ వచ్చిందని, నగరంలోని చిరు వ్యాపారులకు ఈ సరుకు పంపిణీ చేయాల్సి ఉందన్నారు.
ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని ఆధారంగా దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తామని పోలీసు అధికారి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com