ప్రస్తుతం హిందువుకు, హిందుత్వవాదికి మధ్య పోటీ నడుస్తోంది : రాహుల్

By - TV5 Digital Team |12 Dec 2021 11:00 AM GMT
Rahul Gandhi : ప్రస్తుతం హిందువుకు, హిందుత్వవాదికి మధ్య పోటీ నడుస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.
Rahul Gandhi : ప్రస్తుతం హిందువుకు, హిందుత్వవాదికి మధ్య పోటీ నడుస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. మహాత్మగాంధీ హిందువైతే, గాడ్సే హిందుత్వ వాదని... రెండు పదాల్లో చాలా తేడా ఉందన్నారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగింది కాంగ్రెస్. ఈసందర్భంగా రాజస్థాన్ లోని జైపూర్ లో భారీ బహిరంగసభ నిర్వహించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అబద్ధాల మీదే బతుకుతోందన్నారు ప్రియాంక. ప్రకటనల పేరుతో సొంత డబ్బా కొట్టుకోవడానికి వేలకోట్లు తగలేస్తున్న కేంద్రం...రైతులకు మాత్రం రూపాయి ఇవ్వట్లేదని మండిపడ్డారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com