Sonu Sood: ఇదొక అద్భుతమైన వార్త.. ధన్యవాదాలు మోదీజీ..

Sonu Sood: నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన దేశ ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. కొత్తగా తీసుకువచ్చిన మూడు అగ్రిచట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.
ఢిల్లీ సరిహద్దుల్లో గత ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్న రైతులు ఇళ్లకు వెళ్లి పోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రైతులను బాధ పెట్టి ఉంటే క్షమించాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు. మోదీ చేసిన ప్రకటనపై సినీ నటుడు సోనూసూద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
''ఇదొక అద్భుతమైన వార్త! వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నందుకు ధన్యవాదాలు మోదీజీ.. శాంతియుత నిరసనల ద్వారా న్యాయపరమైన తమ డిమాండ్లను లేవనెత్తినందుకు రైతులకు ధన్యవాదాలు. ఈరోజు శ్రీ గురునానక్ జయంతి. ప్రకాష్ పురబ్‌లోని మీ ఇళ్లకు వెళ్లి సంతోషంగా మీ కుటుంబంతో గడుపుతారని ఆశిస్తున్నాను'' అని సోనూసూద్ ట్వీట్ చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com