యాంటీవైరస్ టిపిన్ సెంటర్.. ఏం ఐడియా గురూ..

యాంటీవైరస్ టిపిన్ సెంటర్.. ఏం ఐడియా గురూ..
X
వ్యాపారంలో రాణించాలంటే ఎత్తులకు పై ఎత్తులు వేయాలి.. ఎంతటి కష్టాన్నైనా అధిగమించాలి

వేడి వేడి యాంటీ వైరస్ ఇడ్లీ, దోశ, పూరీ, వడ.. ఏది కావాలన్నా క్షణాల్లో రెడీ.. మరెందుకు ఆలస్యం మా టిఫిన్ సెంటర్‌ని ఓ సారి విజిట్ చేయండి అంటూ ప్రకటన ఇచ్చాడు.. పొద్దున్నకల్లా వాలిపోయారు కస్టమర్లు టిఫిన్ సెంటర్ ముందు.. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో.. అందాకా యాంటీ వైరస్ టిఫిన్ సెంటర్లో ఇడ్లీ తిందాం అని టిఫిన్ సెంటర్ ముందు క్యూ కట్టేశారు ఒడిశాలోని బర్హంపూర్ కస్టమర్లు.. వ్యాపారంలో రాణించాలంటే ఎత్తులకు పై ఎత్తులు వేయాలి.. ఎంతటి కష్టాన్నైనా అధిగమించాలి.. పరిస్థితులకు అనుగుణంగా మారిపోవాలి.. అప్పుడే ఆ వ్యాపారం మూడు పూరీలు.. ఆరు ఇడ్లీలుగా మారుతుందని తెలుసుకున్నాడు.

అచ్చంగా అదే పని చేశాడు. చూడ్డానికి చిన్న దుకాణమే కానీ తన ఐడియా అదిరిపోవడంతో టిఫిన్ సెంటర్‌కి డిమాండ్ పెరిగింది. కోవిడ్ వచ్చి పెద్ద పెద్ద వ్యాపారులను కూడా మూలన కూచోబెట్టింది. అదే జీవనాధారంగా బతుకుతున్న ఇతగాడికి ఆలోచిస్తే ఓ ఐడియా తన్నుకొచ్చింది.. పాత చింతకాయ పచ్చడి లాంటి పాత పేరు మార్చేసి అందరినోళ్లలో నానుతున్న యాంటీ వైరస్ పేరుని ఖరారు చేశాడు.. మొత్తానికి ఖాళీ లేకుండా కప్పులు కడిగేస్తున్నాడు.. వేడి వేడి దోశలు వేసేస్తున్నాడు. దాంతో గల్లా పెట్టి గలగలలాడుతోంది.

కొసమెరుపు ఏంటంటే.. టిఫిన్ సెంటర్‌కి వచ్చిన కస్టమర్లు సామాజిక దూరాన్ని కానీ, మాస్కులు ధరించడం కానీ చేయట్లేదు.. ఆఖరికి శానిటైజర్‌కూడా వాడట్లేదు.. అన్నిటినీ ఆ యాంటీ వైరస్ ఇడ్లీనే చూసుకుంటుంది అని ధైర్యంగా ప్లేట్లకి ప్లేట్లు లాగించేస్తున్నారు.

Tags

Next Story