EC Software: సాఫ్ట్‌వేర్‌తో ఓటర్ల సమాచారానికి ముప్పు.. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు

EC Software: సాఫ్ట్‌వేర్‌తో ఓటర్ల సమాచారానికి ముప్పు.. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు
EC Software: మనకు ఏదైనా ముప్పు ఏర్పడతుందని తెలిస్తే ప్రభుత్వానికి మొరపెట్టుకుంటాం అలాంటిది ప్రభుత్వ సంస్ధతోనే ముప్పు ఏర్పడుతుంటే పరిస్థితి ఎలా ఉంటుంది.

EC Software: మనకు ఏదైనా ముప్పు ఏర్పడతుందని తెలిస్తే ప్రభుత్వానికి మొరపెట్టుకుంటాం అలాంటిది ప్రభుత్వ సంస్ధతోనే ముప్పు ఏర్పడుతుంటే పరిస్థితి ఎలా ఉంటుంది.. సరిగ్గా ఇలానే ఉంది మన దేశ ఎన్నికల కమిషన్‌ ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌.. ఇది ఎవరో అన్న మాటలు కావు.. సాక్షత్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం ఈసీఐతో పాటు ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలకు, ఇరు రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు పంపిన నోటీసుల్లో తెలిపిన వ్యాఖ్యలు.



ఓటర్‌ రికార్డులతో ఆధార్‌ను లింక్‌ చేసే పక్రియలో ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా వాడుతున్న సాఫ్ట్‌వేర్‌తో ఓటర్ల సమాచారానికి ముప్పు ఏర్పడుతుందని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్దాఖలైంది..రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్ల సమాచారాన్ని కులాలు, మతాలు, ప్రాంతం, భాష, ఇన్‌కంతో పాటు మెడికల్‌ హిస్టరీలతో సమాచారాన్ని సేకరిస్తున్నాయని ఆ పిటిషన్‌లో పిటిషనర్‌ తెలిపారు.. హైదరాబాద్‌కు చెందిన టెకీ కొడాలి శ్రీనివాస్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌,జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడాన ధర్మాసనం విచారణకు స్వీకరించడంతో పాటు ఇది చాలా సీరియస్‌ మ్యాటర్‌ అంటూ కామెంట్‌ చేసింది ధర్మాసనం.



ఇక ఈ పక్రయకు ఎలాంటిప్రత్యేక చట్టం లేకున్నా..ఏ ప్రయోజనం లేకున్నా..ప్రభుత్వాలు ఓటర్ల జాబితాను తమ ప్రయోజనాలకు అనుగుణంగా పరిశీలించవచ్చని, ఈ విషయంలో ఈసీ భారత రాజ్యాంగంలోని 324వ ఆర్టికల్‌, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని విస్మరించిందని పిటిషనర్‌ తరపు న్యాయవాది ధర్మాసనం ముందుకు తెచ్చారు..ఈ సాఫ్ట్‌వేర్‌తో తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి వివరణ ఇవ్వకుండా ఓటరు జాబితా ప్రక్షాళన పేరుతో 2015లో 46 లక్షల మంది పేర్లు తొలగించారని అడ్వొకేట్‌ భాటియా ఆరోపించారు. దీని వల్ల తాము బతికే ఉన్నామని ఓటర్లు నిరూపించుకోవాల్సి వస్తోందన్నారు. అయితే గతంలో ఈసీ తన వాదనలు వినిపిస్తూ తమ సాఫ్ట్‌వేర్‌ ఓటరు జాబితాను ప్రక్షాళన చేసేందుకు డేటాబేస్‌ను నిర్వహించే వ్యవస్థ మాత్రమేనని వివరించింది. ఈ సాఫ్ట్‌వేర్‌ ఓటర్లను తొలగించలేదని, దానంతట అదే నిర్ణయం తీసుకోలేదని తెలిపింది..



మరోవైపు ఓటర్‌ రికార్డులు పొందేందుకు ఈసీ రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతినిచ్చిందని,ఈసీ సెక్యూరిటి సాఫ్ట్‌వేర్‌తో ఓటర్లకు సంబంధించి పర్సనల్‌ డేటాతో వారిని వేర్వేరు వర్గాలుగా డేటాను విభజించవచ్చని, ప్రభుత్వాలు తమకు అనుకూల,ప్రతికూల గ్రూప్‌లుగా విభజించడానికి ఈ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడుతుందని.. దీంతో ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ఎలక్షన్‌ జరిగే వీలుండదని పిటిషనర్‌ తరుపు న్యాయవాది భాటియా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.



అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓటర్ల జాబితాలో పేర్లను తొలగించడం,చేర్చడం వంటి అధికారాలు కేవలం రిటర్నింగ్‌ అధికారులకే ఉంటాయని ఈసీ తెలిపింది. పిటిషనర్‌ గతంలోనే తెలంగాణ హైకోర్టులో పిల్‌ వేశారు..ఓటర్‌ జాబితాలో పేరులేని వాళ్లు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని భావించిన హైకోర్టు.. ఆ పిటిషన్‌ను తిరస్కరించడంతో సుప్రీం కోర్ట్‌ను ఆశ్రయించారు పిటీషనర్‌ శ్రీనివాస్‌.. విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం దీనిపై క్లారిటీ ఇవ్వాలని భారత ఎన్నికల కమిషన్‌ ఈసీఐతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, ఇరు రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు నోటీసులు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story