Himachal Pradesh: లోయలో పడిన టెంపో.. ముగ్గురు ఐఐటీ విద్యార్థులు సహా ఏడుగురు మృతి..

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ఆదివారం సాయంత్రం ఒక టెంపో ట్రావెలర్ లోయలో పడింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు ఐఐటీ వారణాసి విద్యార్థులతో సహా ఏడుగురు పర్యాటకులు మరణించారు. 10 మంది గాయపడ్డారు.
బంజర్ సబ్‌డివిజన్‌లోని ఘియాఘి సమీపంలో రాత్రి 8:30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఐదుగురు పర్యాటకులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులను ఢిల్లీకి చెందిన సౌరభ్, ప్రియాంక గుప్తా, కిరణ్, రిషబ్ రాజ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్షికా జైన్, ఆదిత్య, అనన్మయగా గుర్తించినట్లు కులు పోలీసు సూపరింటెండెంట్ గురుదేవ్ శర్మ తెలిపారు.
గాయపడిన వారిలో హర్యానాకు చెందిన రాహుల్ గోస్వామి, క్షితిజా అగర్వాల్, ప్రియపాల్, ఇషాన్ గుప్తా, డ్రైవర్ అజయ్ చౌహాన్, అభినవ్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిష్ఠా బదోని, న్యూఢిల్లీకి చెందిన రుషవ్, రాజస్థాన్‌కు చెందిన లక్షయ, మధ్యప్రదేశ్‌కు చెందిన జై అగర్వాల్‌లు ఉన్నారని ఆయన తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com