ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా..

ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా..
సోమవారం అసెంబ్లీ జరగనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర శాసనసభ్యులందరికీ కోవిడ్ టెస్ట్ చేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్న కేసులు ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా సిక్కింలో సీఎం పేషీలోని ముగ్గురు మంత్రులతో పాటు మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు పాజిటివ్ వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. సోమవారం అసెంబ్లీ జరగనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర శాసనసభ్యులందరికీ కోవిడ్ టెస్ట్ చేశారు. సీఎంకు నెగిటివ్ రాగా, సమాచార మంత్రి లోక్ నాథ్ శర్మ, అటవీ శాఖ మంత్రి కర్మ లోడే భూటియా, విద్యుత్ మంత్రి మింగ్మా నార్బు షెర్బా కొవిడ్ బారిన పడినట్లు అధికారి పేర్కొన్నారు.

ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఫర్వంతి తమంగ్, టీటీ భూటియాలకూ వైరస్ సోకింది. వీరంతా ఐసోలేషన్ లో ఉన్నారని తెలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు గ్యాంగ్ టక్ మున్సిపల్ ఏరియాలో పూర్తి లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సిక్కింలో శుక్రవారం వరకు 2,304 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి 25 మంది మృత్యువాత పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story