'సైకిల్ గర్ల్' జ్యోతికుమారికి అరుదైన గౌరవం!

సైకిల్ గర్ల్ జ్యోతికుమారికి అరుదైన గౌరవం!
అనారోగ్యం బారిన పడిన తన తండ్రి పాశ్వాన్‌ని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసిన జ్యోతికుమారికి అరుదైన గౌరవం లభించింది.

లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు ఎదురుకున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.. స్వగ్రామలకి చేరుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. అందులో భాగంగానే అనారోగ్యం బారిన పడిన తన తండ్రి పాశ్వాన్‌ని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసిన జ్యోతికుమారికి అరుదైన గౌరవం లభించింది. ఆమె దైర్య సాహసాలను మెచ్చిన ప్రభుత్వం ప్రధాన్‌ మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌ అందజేసింది. జ్యోతి కుమారితో పాటుగా మరో 32 మంది చిన్నారులకు కూడా ఈ పురస్కారం లభించింది. ఈ క్రమంలో జ్యోతికుమార్ ను ప్రశంసిస్తూ దేశ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

జ్యోతికుమారి ధైర్యసాహసాల గురించి వర్ణించేందుకు మాటలు సరిపోవు. చూడటానికి తన తోటి పిల్లల్లాగే కనిపిస్తుంది కానీ తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. . బాల్‌ పురస్కార్‌ అందుకున్న బీహార్‌లోని దర్భాంగాకు చెందిన జ్యోతి కుమారికి నా శుభాకాంక్షలు. నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి" అని మోడీ ట్వీట్ చేశారు. అంతేకాకుండా క్రీడా విభాగంలో ఈ పురస్కారం అందుకున్న పదేళ్ల చెస్‌ మాస్టర్‌ ఆర్షియా దాస్‌ను సైతం ప్రధాని మోదీ కొనియాడారు.


Tags

Read MoreRead Less
Next Story