TikTok user : భారీ శరీరం.. బ్రేకప్ చెప్పిన ప్రేయసి.. పట్టుదలతో..

TikTok user : భారీ శరీరం.. బ్రేకప్ చెప్పిన ప్రేయసి.. పట్టుదలతో..
TikTok user : అమ్మాయిలేనా ఐశ్వర్యారాయ్‌లా అందంగా ఉండాలి.. అబ్బాయిలు కూడా హ్యాండ్‌సమ్‌గా ఉండాలి. అందుకే భారీగా పెరిగిపోతున్న బాయ్‌ఫ్రెండ్‌ని రిజెక్ట్ చేసింది.

TikTok User: అమ్మాయిలేనా ఐశ్వర్యారాయ్‌లా అందంగా ఉండాలి.. అబ్బాయిలు కూడా హ్యాండ్‌సమ్‌గా ఉండాలి. అందుకే భారీగా పెరిగిపోతున్న బాయ్‌ఫ్రెండ్‌ని రిజెక్ట్ చేసింది. మరి 70 లేదా 80 కిలోలున్నా అడ్జస్ట్ అయిపోయేది.. ఏకంగా 139 కిలోలుంటే ఏ అతివ మాత్రం సహిస్తుంది. అయితే ఆ ఊబకాయమే పువిని TikTok స్టార్‌ని చేసింది.

కానీ ప్రేయసి తమ ప్రేమకు గుడ్ బై చెప్పడంతో ఎలా అయినా తగ్గాలని పట్టుదలగా ప్రయత్నించాడు. జీవన శైలిని మార్చుకున్నాడు. జిమ్‌కి వెళ్లాడు.. వర్కవుట్లు చేశాడు. కష్టపడి తన శరీరంలో పేరుకున్న కొవ్వునంతా కరిగించాడు.

139 కిలోల బ‌రువుండే పువి ఏడాది కాలంలోనే 70 కిలోలు త‌గ్గాడు. టిక్‌టాక్ యూజ‌ర్ పువి త‌న వ‌ర్క‌వుట్ వీడియోల‌ను త‌ర‌చూ షేర్ చేస్తుండే వాడు. ప్రేయసి తన నిర్ణయానికి పశ్చాత్తాపం చెందేలా పువీ తన బాడీని మలుచుకున్నాడు.

ఇప్పుడు ఒక బాడీ బిల్డర్ మాదిరిగా తయారయ్యాడు. ప్రేయసి కోసం పట్టుదలతో ప్రయత్నించిన అతడి నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. అనుకుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు అని పువీని అభినందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story