ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్..!

ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ పగ్గాలు చేపట్టారు. సాయంత్రం నాలుగు గంటలకు ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తీరత్ సింగ్ రావత్ ప్రస్తుతం గఢ్వాల్ ఎంపీగా ఉన్నారు. త్రివేంద్ర సింగ్ రావత్ నాయకత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి.. త్రివేంద్ర సింగ్ రావత్‌ను మార్చాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో బీజేపీ అధిష్టానం కొత్త సీఎంను ఎన్నుకోవాల్సి వచ్చింది. ఇవాళ జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో తీరత్ సింగ్ రావత్‌ను కొత్త సీఎంగా ఎన్నుకున్నారు. సీఎం రేసులో ఎమ్మెల్యే ధన్‌సింగ్ రావత్, కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ పేర్లు వినిపించినా .. తీరత్ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com