తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి..

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి రూ.50 వేల మార్కు చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర కూడా అదే బాటలో కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో బంగారం ధర రూ.810 మేర పెరిగింది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,070కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.750 పెరిగి, 10 గ్రాముల ధర రూ.45,900కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో డిసెంబర్ ఆరంభంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నేటి మార్కెట్‌లో బంగారం ధరలు రూ.810 మేర పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,410కి పుంజుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.750 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.48,050కి చేరింది. బులియన్ మార్కెట్‌లో గత నెలలో భారీగా పతనమైన వెండి ధరలు తాజాగా ఆకాశాన్నంటుతున్నాయి.
తాజాగా ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర రూ.700 మేర భారీగా పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.62,400 చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.400 మేర పతనమైంది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.67,300కి దిగొచ్చింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com