ఏడాదిలో కనుమరుగు కానున్న దేశంలోని అన్ని టోల్ ప్లాజాలు

ఏడాదిలో కనుమరుగు కానున్న దేశంలోని అన్ని టోల్ ప్లాజాలు

Fast Tag Toll Plaza

ఫాస్టాగ్‌ లేకపోతే జీఎస్టీ ఎగవేసే అవకాశం ఉందని.. అందుకే వీరిపై పోలీస్ విచారణ చేయిస్తామన్నారు.

ఏడాదిలో దేశంలోని అన్ని టోల్ ప్లాజాలు కనుమరుగు కానున్నాయి. ఇకపై టోల్ వసూలన్నీ జీపీఎస్ ద్వారానే జరగనున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్ సభలో ప్రకటించారు. ఇప్పటివరకు దేశంలో 93 శాతం వాహనాలు ఫాస్టాగ్‌ ఉపయోగిస్తున్నాయని.. మిగిలిన ఏడు శాతం మంది రెట్టింపు టోల్ కడుతున్నారు గానీ ఫాస్టాగ్ లో చేరడం లేదని పేర్కొన్నారు. ఫాస్టాగ్‌ లేకపోతే జీఎస్టీ ఎగవేసే అవకాశం ఉందని.. అందుకే వీరిపై పోలీస్ విచారణ చేయిస్తామన్నారు.

అటు రోడ్డు ప్రమాదాలపై స్పందించిన గడ్కరీ.. కరోనా మహమ్మారిని మించి.. రోడ్డు ప్రమాదాల్లోనే మరణాలు చోటుచేసుకుంటున్నాయని విచారం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా లక్ష 46 వేల మరణాలు సంభవిస్తే.. గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లోనే ఒకటిన్నర లక్షల మంది చనిపోయారు అని వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ శాతం 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులేనని తెలిపారు.

మరోవైపు పాత కార్లను తుక్కుగా మార్చి పొందిన సర్టిఫికెట్‌ ను షోరూమ్‌లలో చూపిస్తే కొత్త కార్లపై 5శాతం రాయితీ ఇవ్వాలని కేంద్రం సూచించింది. అంతేకాకుండా వ్యక్తిగతంగా కార్లు కొంటే 25శాతం, వాణిజ్య కార్లపై 15శాతం రోడ్‌ టాక్స్‌లో రాయితీ ఇవ్వాలని పేర్కొంది. 15 సంవత్సరాలు దాటిన వాణిజ్య వాహనాలు, 20 సంవత్సరాలు దాటిన ప్రైవేట్‌ వాహనాలకు మంగళం పలకాలని స్పష్టం చేసింది.

దేశంలో 20 ఏళ్లు దాటిన తేలికపాటి మోటారు వాహనాలు 51 లక్షలు, 15 సంవత్సరాలు దాటిన వాహనాలు 34 లక్షలు ఉన్నాయని తెలిపింది. దేశంలో 15 సంవత్సరాలు దాటిన ఫిట్‌ నెస్‌ సర్టిఫికెట్‌ లేని మధ్య తరహా, భారీ వాణిజ్య వాహనాలు 17 లక్షల మేరకు ఉన్నాయంది. వాటి వల్ల 10 నుంచి12 శాతం వాయు కాలుష్యం పెరగడమే కాక, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో స్వచ్చందంగా వాహనాలను ఆధునీకరించడం లేదా తుక్కుగా మార్చే విధానాన్ని ప్రవేశపెడుతున్నామంది.



Tags

Read MoreRead Less
Next Story