అక్కడేం బాలేదు.. కాస్త చూడండి సార్: రాజమౌళి ట్వీట్

అక్కడేం బాలేదు.. కాస్త చూడండి సార్: రాజమౌళి ట్వీట్
దయచేసి వీటిపై దృష్టి సారించండి అని రాజమౌళి అధికారులకు ట్వీట్ చేశారు.

దేశ రాజధాని.. పాలక ప్రముఖులంతా నివసించే చోటు. ఇక విమానాశ్రయం అంటే సామాన్య వ్యక్తులకంటే సంపన్నులే అధికంగా ప్రయాణించే స్థలం. మరి అక్కడ కూడా సౌకర్యాలు అరకొరగా ఉంటే బాలేదని అనుకోకుండా ఉండలేం కదా. అదే తెలుగు దర్శక ధీరుడు రాజమౌళి చేశారు.

ఓ ముఖ్యమైన పనిమీద ఢిల్లీ వెళ్లిన ఆయన విమానాశ్రయంలోని సౌకర్యాలు చూసి అసహనం చెందారు. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం అవసరమైన కొన్ని పేపర్లు ఇచ్చి వాటిలో తగిన సమాచారాన్ని రాసి ఇమ్మన్నారు.

పత్రాలు నింపడం కోసం కొంత మంది ప్రయాణీకులు గోడలకు ఆనుకుని, మరి కొంత మంది నేలపైన కూర్చుని వాటిని పూర్తి చేస్తున్నారు. చూడడానికి ఏం బాలేదు. రాసేందుకు చిన్న చిన్న టేబుల్స్ లాంటివి ఏర్పాటు చేస్తే కాస్త సౌకర్యంగా ఉండేది.

ఇక ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చాక గేటు వద్ద వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇలాంటివి చూస్తే విదేశీయులకు మనపై ఎలాంటి భావన కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి వీటిపై దృష్టి సారించండి అని రాజమౌళి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారులకు ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్ అయింది. విమానాశ్రయ అధికారులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story