Tomato Fever: కేరళలో టమోటో ఫీవర్ కలకలం.. పిల్లల శరీరంపై ఎర్రటి పొక్కులు..!

Tomato Fever: చిన్నారులను, తల్లిదండ్రులను బయపెడుతున్న టమోటో ఫీవర్ కేరళలో అందోళన రేపుతున్నాయి.. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 80 మందికి పైగా పిల్లలు వైరస్ బారిన పడ్డారు.. టమోటో సైజులో దద్దుర్లు, దురద, డీహైడ్రేషన్, వంటి లక్షణాలు ఈ ఫీవర్ సోకిన వారిలో కనిపిస్తాయి.. టమోటా ఫీవర్ వ్యాప్తిపై తమిళనాడులోనూ ఆందోళన నెలకొన్నది.
దీంతో సరిహద్దు జిల్లాల్లో పరీక్షలు చేపడుతున్నారు. ఐతే ఈ వ్యాధి ఎలా సోకిందన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు.. టొమాటో ఫ్లూ అనేది వైరల్ ఫీవరా లేక చికున్‌గున్యా లేదా డెంగ్యూ జ్వరమా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇది కేరళలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇవి సాధారణంగా ఎరుపు రంగులో ఉంటాయి - అందుకే దీనిని 'టమోటో ఫ్లూ' లేదా 'టమోటో ఫీవర్ ' అని పిలుస్తారు.
కొన్నిసార్లు వాటి పరిమాణం టమోటాతో సమానంగా మారుతుంది.. పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నేరుగా వైద్యుడిని సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com