బామ్మ వలలో భలే చేప.. 52 కిలోలు మరి..

ఆ వయసులో కూడా బామ్మ కుటుంబానికి ఆధారమైంది. తనకు వచ్చిన పని చేసేందుకు రోజులానే భుజానికి వల తగిలించుకుని చేపలను వేటాడ్డానికి నది వద్దకు వెళ్లింది. బామ్మ కష్టం చూడలేకపోతోందేమో నదీమ తల్లి ఆ రోజు ఆమె వలలో ఓ భారీ చేపను పడేలా చేసింది.. పశ్చిమ బెంగాల్ పరగనాస్ జిల్లాలోని సుందర్‌బన్స్ ప్రాంతంలో ఉన్న సాగర్ దీవులకు ఓ వృద్ధ మహిళ పుష్పా కార్ చేపలు పట్టేందుకు వెళ్లింది. వలలో ఆమెకు 52 కిలోల చేప చిక్కింది.
వృద్ధురాలు ఆ చేపను మార్కెట్లో అమ్మకానికి పెట్టగా రూ.3 లక్షలకు పైగా ధర పలికింది. అది ఇంకా చనిపోయిన చేప కాబట్టి అంతే ధర పలికిందని.. అదే బతికుంటే మరింత రేటు పలికేదని చేపల వ్యాపారులు చెప్పారు. అంత పెద్ద చేపను మునుపెన్నడూ చేడలేదని అన్నారు.
నదిలో తేలియాడుతున్న ఆ పెద్ద చేపను చూసిన కార్ వెంటనే దూకేసి దాన్ని ఒడ్డుకు లాక్కొని వచ్చింది. ఆ చేపను భోలా చేపగా గుర్తించిన స్థానికులు దాన్ని మార్కెట్‌కు తీసుకెళ్లడానికి ఆమెకు సహాయం చేశారు. ఆ చేప ధరను కిలోకు రూ.6,500 చొప్పున మొత్తం రూ.3 లక్షలకు పైగా ఇచ్చి తీసుకున్నారు. దీన్ని విదేశాలకు ఎగుమతి చేస్తామని అన్నారు వ్యాపారస్తులు. ఔషధ ప్రయోజనాలకు ఈ చేపను వినియోగిస్తారని అన్నారు. వచ్చిన డబ్బులను చూసి కార్ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు కొన్నైనా గట్టెక్కుతాయని ఆనందపడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com