సాగు చట్టాలపై సెలబ్రిటీల టూల్‌కిట్ ట్వీట్లపై ఢిల్లీ పోలీసులు సీరియస్

సాగు చట్టాలపై సోషల్ మీడియాలో పలువురు సామాజిక కార్యకర్తలు చేసిన టూల్ కిట్ ట్వీట్లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన టూల్‌కిట్‌ను రూపొందించడంలో... సామాజిక కార్యకర్త దిశతో పాటు నికితా జాకబ్, శంతనులే కీలక సూత్రధారులని ఢిల్లీ పోలీసులు తేల్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై రూపొందించిన టూల్‌కిట్‌ను వీరే... గ్రెటా థన్‌బర్గ్‌తో పంచుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే నమోదైన దేశద్రోహం కేసులో దిశరవి అరెస్టయ్యారు.
ఈ టూల్‌కిట్ వ్యవహారంలోనే... సామాజిక కార్యకర్త నికితా జాకబ్,శాంతనులపై కూడా పోలీసులు చర్యలకుసిద్ధమయ్యారు. అయితే వారిలో నికితా జాకబ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. టూల్‌కిట్‌ను చేరవేసేందుకు దిశ ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. అయితే, ఈ వాట్సాప్ గ్రూపును దిశ తొలగించినట్లు గుర్తించామన్నారు.
అంతేకాకుండా, గణతంత్ర దినోత్సవం ముందు రోజు ఖలిస్థాన్ గ్రూపునకు చెందిన పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్- PJF ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్‌లో నికితా జాకబ్, శంతను పాల్గొన్నారని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. దీంతోపాటు... టూల్‌కిట్‌ను ఎడిట్ చేసిన వారిలో నికితా జాకబ్ ఉన్నారని తెలిపారు ఢిల్లీ పోలీసులు. ఇదిలాఉంటే, ఈ టూల్‌కిట్ వ్యవహారంలో ఇప్పటికే దిశ రవిని అరెస్టు చేయడంతో పాటు ఇద్దరిపై అరెస్టు వారెంటు జారీ చేశారు. టూల్‌కిట్ వ్యవహారంతో సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలో నికితా జాకబ్, శంతనులపై పోలీసుల విజ్ఞప్తి మేరకు ఢిల్లీ న్యాయస్థానం నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ చేసింది.
తుపాకులను కలిగినవారు, నిరాయుధురాలైన ఓ యువతికి భయపడుతున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ఆ అమ్మాయికి తన తరఫు నుంచి ధైర్యాన్ని అందచేస్తున్నానంటూ... దిశా రవిని విడుదల చేయాలని ట్వీట్ చేశారు ప్రియాంకా గాంధీ.
Play Priyanka Tweet-
రైతులకు మద్దతు పలికేందుకు ఉద్దేశించిన టూల్‌కిట్, భారత భూభాగంలో చైనా దురాక్రమణ కంటే ప్రమాదకరమేమీ కాదని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ట్వీట్ చేశారు. మౌంట్ కార్మెల్ కాలేజ్‌లో చదువుతున్న విద్యార్థిని, పర్యావరణ కార్యకర్త అయిన దిశా రవి.. దేశానికి ప్రమాదకారి అయిందంటే... భారత్ అంత బలహీనమైన పునాదులపై ఉందా? అంటూ వరుస ట్వీట్లలో ప్రశ్నించారు చిదంబరం.
Play Priya tweet- Chidam -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆల్ ఇండియా ప్రొగ్రెసివ్ వుమన్స్ అసోసియేషన్ సెక్రటరీ కవితా కృష్ణన్, హక్కుల కార్యకర్త షబ్నమ్ హష్మీ, తొమ్మిదేళ్ల పర్యావరణ వేత్త లిసిప్రియా కాంగుజామ్ తదితరులు దిశ అరెస్టుపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. 50 మందికి పైగా విద్యావేత్తలు, కళాకారులు, కార్యకర్తలు కలిసి దిశ అరెస్టు అన్యాయమని, ప్రభుత్వం మరీ అతిగా వ్యవహరిస్తోందన్నారు.
Play Priya Tweet- Kejriwal-
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com