ఆరు నెలల అనంతరం తాజ్ అందాలు..

ఆరు నెలల అనంతరం తాజ్ అందాలు..
17 వ శతాబ్దపు ప్రేమ స్మారక చిహ్నం ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్‌ను ఈ రోజు నుంచి సందర్శకుల కోసం తిరిగి తెరవబడుతుంది.

మునుపెన్నడూ జరగనిది కరోనా వచ్చి తాజ్ మహల్ కు తాళాలు వేయించింది. గత ఆరునెలలుగా సందర్శకులు లేక వెల వెల బోయిన తాజ్ మహల్‌ను తెరిచేందుకు పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.17 వ శతాబ్దపు ప్రేమ స్మారక చిహ్నం ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్‌ను ఈ రోజు నుంచి సందర్శకుల కోసం తిరిగి తెరవబడుతుంది. తాజ్ ను సందర్శించేందుకు ప్రజలు ఇప్పటికే ఆన్‌లైన్ టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. ఆరునెలల అనంతరం తెరుచుకున్న తాజ్‌ను సందర్శించేందుకు వచ్చిన మొదటి వ్యక్తి భారతదేశంలో ఉంటున్న తైవాన్ నుండి వచ్చిన పర్యాటకుడు.

సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, సందర్శించే గంటలు మరియు పర్యాటకుల సంఖ్య పరిమితి కోసం కఠినమైన నియమాలు రూపొందించబడ్డాయి. రోజుకు 5000 మంది పర్యాటకులను మాత్రమే అనుమతిస్తారు. తాజ్ మహల్ యొక్క సంరక్షకుడు అమర్ నాథ్ గుప్తా మాట్లాడుతూ "తూర్పు పశ్చిమ ద్వారాల వద్ద శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్, సామాజిక దూరం కోసం సర్కిల్స్ వేశామని తెలిపారు. ఉదయం షిప్ట్‌లో 2,500, మధ్యాహ్నం షిప్ట్‌లో 2500 మంది సందర్శకులను మాత్రమే అనుమతిస్తారు. విదేశీయులు 1,100 ప్రవేశ టిక్కెట్లను కొనుగోలు చేయవలసి ఉంటుంది. దేశీయ సందర్శకులు టికెట్‌కు 50 రూపాయలు చెల్లించి ప్రవేశించగలరు.

తాజ్ మహల్‌ను సందర్శించిన తైవాన్ వ్యక్తి ఆ కట్టడాన్ని చూసి మాటలు లేకుండా ఉండిపోయాను అని అన్నాడు. మరో సందర్శకుడు నిశాంత్ వశిష్ట్.. నేను నా కుటుంబంతో వచ్చాను, క్యూలో నిలబడి, డిజిటల్ టిక్కెట్లు పొందాను. తాజ్ మందిరాన్ని చూడాలనే ఆతృతలో ఉన్నానుచూడటానికి సిద్ధంగా ఉన్నాను. గార్డ్లు మా శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే మమ్మల్ని లోపలికి అనుమతించారు. ఈ సమయంలో ఎక్కువ మంది లేరు (ఉదయం 6:30 గంటలకు) కాబట్టి తాజ్ అందాలు ఆస్వాదించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని తెలిపారు. స్మారక చిహ్నం యొక్క రెయిలింగ్‌ను కానీ గోడను కానీ ఎవరూ తాకకుండా చూస్తున్నారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫోటోలు దిగడానికి అనుమతి లేదు.

Tags

Next Story