Taj Mahal : తాజ్‌మహల్‌లోకి ఎంట్రీ ఫ్రీ... ఆ మూడు రోజులు మాత్రమే..

Taj Mahal : ఐదో మొఘల్ చక్రవర్తి షాజహాన్ 367 ఉర్స్ సందర్భంగా ఈ నెల 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు సందర్శకులకు ఉచితంగా తాజ్‌మహల్‌ని ఉచితంగా సందర్శించవచ్చునని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 27 మరియు 28 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సూర్యాస్తమయం వరకు పర్యాటకులు సందర్శించవచ్చని, అయితే మార్చి 1 న మాత్రం పూర్తి సమయం.. అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు అనుమతిస్తామని వెల్లడించారు.
అయితే పర్యాటకులందరూ కోవిడ్ రూల్స్ తప్పకుండా పాటించాలని సూచించారు. ఉర్సు సందర్భంగా ఆనవాయితీ ప్రకారం చాదర్ పోషి, శాండల్, గుసుల్, కుల్ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టూరిస్ట్ గైడ్స్ అసోసియేసన్ అధ్యక్షుడు షంసుద్దీన్ ఖాన్ తెలిపారు. షాజహాన్ మరియు అతని భార్య ముంతాజ్ యొక్క అసలైన సమాధులను చూడటానికి సందర్శకులు నేలమాళిగలోకి ప్రవేశించడానికి సంవత్సరంలో ఒకసారి మాత్రమే అనుమతిస్తారని టూరిస్ట్ గైడ్ షకీల్ రఫీక్ చెప్పారు.
కాగా తాజ్‌మహల్ సందర్శనకు భారతీయులు రూ. 50( మ్యూజియం చూసేందుకు రూ. 200 విదేశీయులు రూ. 1100 ) సాధారణ రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com