నిండు గర్భిణికి కోవిడ్ పేరుతో చికిత్స.. రూ.29 లక్షలు వసూలు చేసి మృతదేహాన్ని..

నిండు గర్భిణికి కోవిడ్ పేరుతో చికిత్స.. రూ.29 లక్షలు వసూలు చేసి మృతదేహాన్ని..
బిల్లు బ్యాలెన్స్ ఉంది.. కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లండి అని చావు కబురు చల్లగా చెప్పారు ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు.

కోవిడ్ పేరుతో చికిత్స అందించారు.. లక్షల్లో ఫీజు వసూలు చేశారు.. పోనీ కోలుకుందా అంటే అదీ లేదు.. ఆఖరికి బిల్లు బ్యాలెన్స్ ఉంది.. అది కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లండి అని చావు కబురు చల్లగా చెప్పారు హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం బల్బురుగొండకు చెందిన మాధవరెడ్డి భార్య శ్వేతారెడ్డి గ్రూప్-2లో ఏసీటీవోగా ఎంపికై హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. నిండు గర్భిణి అయిన ఆమెకు జులై 27న జ్వరం రావడంతో మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. జ్వరం తగ్గకపోవడంతో కోవిడ్ భయానికి ఎవరూ ఆస్పత్రిలో జాయిన్ చేసుకోవడానికి సుమఖత చూపలేదు. దీంతో భార్యని తీసుకుని హైదరాబాద్ చేరుకున్నారు మాధవరెడ్డి. రూ.2 లక్షలు కడితే సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీస్తామన్నారు. మగశిశువుకు జన్మనిచ్చిన రెండు రోజుల తరవాత శ్వేతకు ఆయాసం రావడంతో కోవిడ్ పరీక్షలు

చేశారు. రిజల్ట్ చూపించకుండానే పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అత్యవసర చికిత్స అందించమని కుటుంబసభ్యులు కోరడంతో ఆగస్ట్ 12న ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారు. 20 రోజుల పాటు ఐసీయూలో ఉంచారు.. ఫీజుల రూపంలో బిల్లు లక్షల్లో కట్టించుకుంటున్నారు. మాధవరెడ్డి తన భార్యను చూసేందుకు అనుమతించండి అని కోరడంతో పీపీఈ కిట్ ధరించి లోపలికి వెళ్లమన్నారు. ఐసీయూ బెడ్ పై ఉన్న శ్వేతా రెడ్డి కళ్లతో చూడడం తప్పించి ఎవరినీ గుర్తించే స్థితిలో లేదని మాధవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భార్య అలా జీవచ్ఛవంలా పడి ఉండడంతో వైద్యులను నిలదీశాడు మాధవరెడ్డి.. రిపోర్టులు ఇవ్వండి మరో వైద్యుడిని సంప్రదిస్తాను అని అన్నా చెప్పడంతో చివరకు గురువారం తెల్లవారు జామున శ్వేత మృతి చెందినట్లు ఆస్పత్రి సిబ్బంది కుటుంబసభ్యులకు తెలియజేశారు. దాదాపు రూ.29 లక్షలు ఖర్చు చేసినా ఎలా చనిపోయిందో చెప్పట్లేదని.. వివరాలు అడుగుతున్నా ఆసుపత్రి యాజమాన్యం పట్టించుకోవట్లేదని మాధవరెడ్డి వాపోతున్నారు. దీనిపై హైదరాబాద్ డీఎంహెచ్ వోకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story