Madhya Pradesh: కష్టాలు గట్టెక్కాయ్.. కట్టెలు సేకరించేందుకు వెళుతుంటే వజ్రం దొరికింది..

Madhya Pradesh: కష్టాలు గట్టెక్కాయ్.. కట్టెలు సేకరించేందుకు వెళుతుంటే వజ్రం దొరికింది..
Madhya Pradesh: ఎదుగు బొదుగూ లేని జీవితాలు, చాలీ చాలని సంపాదనలు.. ప్రతి రోజూ కూలికి వెళితే కానీ ఇల్లు గడవదు. వాళ్ల కష్టం చూడలేకపోయింది.

Madhya Pradesh: ఎదుగు బొదుగూ లేని జీవితాలు, చాలీ చాలని సంపాదనలు.. ప్రతి రోజూ కూలికి వెళితే కానీ ఇల్లు గడవదు. వాళ్ల కష్టం చూడలేకపోయింది. అదృష్ట దేవత వరించింది. కట్టెలు సేకరించేందుకు వెళుతున్న ఆమెకు 20లక్షల విలువ చేసే వజ్రం దొరికింది.

విలువైన రాళ్ల గనులకు ప్రసిద్ధి చెందిన మధ్యప్రదేశ్‌లోని పన్నాలోని అటవీ ప్రాంతంలో కట్టెలు సేకరించేందుకు వెళ్లిన ఓ నిరుపేద మహిళకు 4.39 క్యారెట్ల విలువైన వజ్రం దొరికింది. అంచనాల ప్రకారం వేలంలో వజ్రం రూ.20 లక్షల వరకు పలుకుతుందని అధికారులు తెలిపారు.

పురుషోత్తంపూర్‌కు చెందిన గెండా బాయి బుధవారం కట్టెలు సేకరించేందుకు అడవికి వెళ్లగా, బుధవారం ఆమెకు విలువైన రాయి దొరికిందని డైమండ్ ఇన్‌స్పెక్టర్ అనుపమ్ సింగ్ తెలిపారు. "దొరికిన వజ్రాన్ని తీసుకుని నేరుగా ఆ మహిళ తన భర్తతో కలిసి డైమండ్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ఆమె వజ్రాన్ని డిపాజిట్ చేసింది.

ముడి వజ్రాన్ని వేలం వేసి, ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించిన తర్వాత వచ్చిన మొత్తాన్ని మహిళకు అందజేస్తామని అధికారులు తెలిపారు. గెండా బాయి విలేకరులతో మాట్లాడుతూ.. అడవి నుంచి కట్టెలు సేకరించి అమ్ముకోవడంతోపాటు కూలి పనులు చేస్తూ ఇంటిని నడిపిస్తున్నట్లు తెలిపారు.

తనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారికి వివాహ వయస్సు వచ్చినట్లు ఆమె తెలిపారు. వేలం ద్వారా వచ్చిన డబ్బును తన ఇంటి నిర్మాణానికి, కుమార్తెల పెళ్లికి వినియోగిస్తానని ఆమె తెలిపారు.

మధ్యప్రదేశ్‌లోని పేద బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని జిల్లా పన్నా, డైమండ్ గనులకు ప్రసిద్ధి చెందింది.

Tags

Read MoreRead Less
Next Story