Trishul : త్రిశూలం ధాటికి చైనా సైన్యం గిలగిలా కొట్టుకోవాల్సిందే..!

గాల్వాన్ ఘటన గుర్తుందా! చైనా మూకలు, భారత్ ఆర్మీ మధ్య జరిగి ఘర్షణ ...దేశాన్ని కలిచివేసింది! చైనా మూకలు ఇనుపరాడ్లు, ఇనుపముళ్ల ఆయుధాలతో దాడి చేశాయి.! చైనా మూకల్ని ధీటుగా ఎదుర్కొన్నారు మన సైనికులు. అంతే కాదు చైనాకు భారీగా నష్టం కలిగించారు కూడా. 1996, 2005లో భారత్-చైనా మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఇరుదేశాలు తమ బోర్డర్‌లో.... గన్‌లు, తుపాకులు వాడకూడదు. అందుకే గాల్వాన్‌లో... చైనా మూకలు ఇనుపరాడ్లు, ఇనుపముళ్ల ఆయుధాలతో ఇండియన్ ఆర్మీపై దాడి చేశాయి. అయినా చైనా మూకల్ని ధీటుగా ఎదుర్కొని పోరాడింది ఇండియన్ ఆర్మీ.... spot with music
అయితే.. అప్పట్లో ధీటుగా ఎదుర్కొన్నా... మన ఆయుధాలు అంత పవర్‌ఫుల్‌గా లేవు. దీంతో.. సరికొత్త ఆయుధాలపై దృష్టిపెట్టింది భారత్ ఆర్మీ. నోయిడాలోని అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఈ ఆయుధాల తయారీ బాధ్యతను అప్పగించింది. ఈ సంస్థ తయారు చేసిన ఆయుధాలు.. ఇప్పుడు చైనా సైనిక మూకలకు షాక్ ట్రీట్ ఇవ్వనున్నాయి. ఇది శివుడి చేతిలోని త్రిశూలం! ఈ త్రిశూలం భారత ఆర్మీకి ఫవర్‌ఫుల్ వెపన్‌గా మారింది. త్రిశూలం నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. దీంతో ప్రత్యర్థి సెకెన్ల వ్యవధిలోనే అపస్మారకస్థితికి గురవుతాడు.
ఇక... వజ్ర అనేది మరో పవర్‌ఫుల్ వెపల్. మెరుపులతో కూడిన మెటల్ డివైజ్ ... శత్రు సైనికులపై దాడి చేసేందుకు వారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పంక్చర్ చేసేందుకు ఉపయోగపడుతుంది..మరొకటి....సప్పర్ పంచ్ పేరుతో తయారుచేసిన గ్లౌజ్! ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కొత్త టెక్నాలజీతో గ్లౌజ్ తొడుక్కొని ఒక్క పంచ్ ఇస్తే చైనామూకలు మూర్ఛపోవాల్సిందే! ఈ లాఠీలు తాకితేచాలు... డ్రాగన్ బలగాలు గిలగిలా కొట్టుకోవాల్సిందే! ఈ ఆయుధాలేవీ శత్రువుల ప్రాణాలు తీయవు. వారిని షాక్‌కు గురిచేస్తాయి.ఈ ఆయుధాలన్ని ప్రాణహాని లేనివి. ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లొచ్చు.
గల్వాన్ ఘర్షణలో చైనీయులు సంప్రదాయ ఆయుధాలను వాడారు. అందుకే తాము కూడా భారత సంప్రదాయాన్ని చాటుతూ త్రిశూలాన్ని తయారుచేసినట్టు అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మోహిత్ కుమార్ వెల్లడించారు. ఈ ఆయుధాలను ప్రైవేటు వ్యక్తులు, సామాన్య ప్రజలకు విక్రయించరు. భద్రతా బలగాలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు మాత్రమే విక్రయిస్తారు. మొత్తానికి... ఆర్మీలోనూ త్రిశూలం వంటి మన సంప్రదాయ ఆయుధాలు వాడటం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com