అల్లు 'రామాయణం'లో త్రివిక్రమ్..

అల్లు రామాయణంలో త్రివిక్రమ్..
ప్రపంచ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకుని భారీ హంగులతో ఈ సినిమా రూపొందనుందనున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంటోంది. బడా నిర్మాతలంతా అలాంటి సినిమాలు నిర్మించడానికే మక్కువ చూపుతున్నారు. భారీ తారాగాణంతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బడా నిర్మాత అల్లు అరవింద్ 'రామాయణ' చిత్రానికి రూపకల్పన చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో దర్శకుడు త్రివిక్రమ్ కూడా భాగం కాబోతున్నారని సమాచారం.

భారత దేశ సినీ పరిశ్రమ గర్వించే స్థాయిలో పలు భాషల్లో రామాయణ చిత్రాన్ని రూపొందించాలని యూనిట్ భావిస్తున్నారు. ఈ భారీ సినిమా నిర్మాణంలో ముగ్గురు నిర్మాతలు భాగం కానుండగా అందులో ఒకరు టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్. ప్రపంచ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకుని భారీ హంగులతో ఈ సినిమా రూపొందనుందనున్నట్లు తెలుస్తోంది. రామాయణ గాథ అందిరికీ తెలిసిందే అయిన నేటి తరం ప్రేక్షకులను ఆకట్టుకునేలా వినూత్నంగా తెరకెక్కించాలనుకుంటున్నారు.

ఇందుకోసం 1000 కోట్ల పైన బడ్జెట్ కేటాయించారు. అయితే ఈ కథకు తగిన డైలాగ్స్ అందించాలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని ఎంచుకున్నారని తెలుస్తోంది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ చర్చలు జరుపుతోంది.

Tags

Next Story