మారిన ట్రంప్ మనసు.. కోటి మందికి లబ్ది

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనసు మార్చుకున్నారు. మరొకొద్ది రోజుల్లో అధ్యక్ష పదవినుంచి దిగిపోయే ముందు ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో ఏమో అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్దరించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఉద్దీపన బిల్లుపై సంతకం చేశారు. దీంతో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం తప్పింది. భారీ సంక్షోభం నుంచి అమెరికా గట్టెక్కింది.
నిన్నటి వరకు సంతకం చేసేది లేదని ట్రంప్ మొండిగా వ్యవహరించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమయింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ అధికార పగ్గాలు చేపట్టే వరకు తీవ్ర ఆర్థిక కష్టాలు తప్పవని భావించారు. కానీ ట్రంప్ మనసు మార్చుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ట్రంప్ ఈ బిల్లుపై సంతకం చేయడంతో నిరుద్యోగ ప్రాయోజిత పథకాల కింద దాదాపు 95 లక్షల మంది అమెరికన్లు లబ్ది పొందనున్నారు. ఈ పథకం కింద నిరుద్యోగులకు అందుతున్న తోడ్పాడు మరో 11 వారాలు కొనసాగనుంది. ఈ పథకాల గడువు వచ్చే శనివారంతో ముగియనుండగా.. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం అందరికీ ఊరట కల్పించింది.
కరోనా సంక్షోభంతో భారీగా నష్టపోయిన అమెరికన్లకు ఆర్థిక సహాయం అందించేందుకు 900 బిలియన్ డాలర్ల ప్యాకేజీతో కూడిన బిల్లును ఉభయసభలు ఆమోదించాయి. అయితే అధ్యక్షుడు ట్రంప్ దానిపై సంతకం చేయడానికి నిరాకరించారు. చిన్న వ్యాపారులకు 600 డాలర్ల సహాయం సరిపోదని దాన్ని రెండు వేల డాలర్లకు పెంచాలని.. అమలుకు సాధ్యం కాని సూచనలను ట్రంప్ ఇస్తూ వచ్చారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com