ఇంటర్ మీడియట్ అకడమిక్ క్యాలెండర్ విడుదల..

ఇంటర్ మీడియట్ అకడమిక్ క్యాలెండర్ విడుదల..
రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. విద్యా సంవత్సరం మొత్తం పనిదినాలను 220 రోజులకు బదులు 182 రోజులుగా పేర్కొంది. ఈ నెల 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైనట్లు పేర్కొంది. దసరాకు మూడు రోజులు (అక్టోబర్ 23,24,25), అదే విధంగా సంక్రాంతికి రెండు రోజులు (జనవరి 13,14) సెలవులు ప్రకటించింది. ఫిబ్రవరి 22 నుంచి 27వ తేదీ వరకు ఫ్రీ ఫైనల్ పరీక్షలు, మార్చి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి 24 నుంచి ఏప్రిల్ 12 వరకు వార్షిక పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్ 17 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు. మే చివరి వారంలో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ. 20211 జూన్ 1వ తేదీ నుంచి తిరిగి కాలేజీ ప్రారంభం అవుతుందని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story