హైదరాబాద్ శివార్లలో టిఎస్ఆర్టీసి బస్సు సేవలు ప్రారంభం..

తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టిఎస్ఆర్‌టిసి) బుధవారం హైదరాబాద్ శివార్లలో బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభించింది. ఆరు నెలల తరువాత తెలంగాణ రాజధాని శివార్లలోని రోడ్లపై సిటీ బస్సులు కనిపించాయి. రాజేందర్ నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ డిపోల నుంచి బస్సులు నడిపారు.
ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ ప్రతి డిపో నుంచి 12 బస్సులు నడుపుతోంది. ఈ సంఖ్యను క్రమగా పెంచుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే నగర రోడ్లపై ఎప్పుడు ప్రారంభించాలనే దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం అమోదిస్తే బస్సులు నడపడానికి తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఇప్పటికే బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభమైనందున హైదరాబాదులో కూడా బస్సు సేవలను పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వం కూడా ఆసక్తి చూపుతోంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కూడా సిటీ బస్ సేవలు ప్రారంభమయ్యాయి. నగరంలో మెట్రో సేవలు పునరుద్ధరింపబడినందున బస్సులు నడపాలని ప్రయాణీకుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com