కరోనాతో టీవీ నటి మృతి

కరోనాతో టీవీ నటి మృతి

ఉత్తరాదిన పలు టీవీ సీరియళ్లలో నటించి నటిగా ముద్ర వేసుకున్న దివ్యా భట్నాగర్ (34) కరోనాతో కన్నుమూశారు. ముంబయిలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు, నటీమణులు దేవొలీన భట్టాచార్య, శిల్పా శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నవంబర్ 26న దివ్య అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరారు.

కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె అప్పటికే న్యుమోనియాతో బాధపడుతున్నారు. కుమార్తె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని తల్లిదండ్రులు గతవారమే తెలిపారు. ఈ క్రమంలో మెరుగైన ఆరోగ్యం కోసం పలు ఆస్పత్రులు చేర్పించినా ప్రయోజనం లేకపోయింది.

యే రిష్తా క్యా కహ లాతాహై, తేరా యార్ యూ మై, ఉదాన్, విష్ లాంటి కార్యక్రమాలతో దివ్య ప్రేక్షకులను అలరించారు. యువ నటిగా రాణిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన దివ్య ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం అభిమానులను కలచి వేస్తోంది. సహ నటులు ఆమె మృతికి సంతాపం తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా నివాళి అర్పిస్తున్నారు.

Tags

Next Story