జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌‌ను ప్రత్యేక దేశంగా చూపిన ట్విటర్..!

జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌‌ను ప్రత్యేక దేశంగా చూపిన ట్విటర్..!
జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం కాదంటూ మరోసారి తప్పుడు కూత పెట్టింది ట్విటర్‌. లద్దాఖ్‌‌‌తో సహా జమ్మూ అండ్‌ కశ్మీర్‌ ప్రాంతాలు ప్రత్యేక దేశంగా చూపించింది.

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం కాదంటూ మరోసారి తప్పుడు కూత పెట్టింది ట్విటర్‌. లద్దాఖ్‌‌‌తో సహా జమ్మూ అండ్‌ కశ్మీర్‌ ప్రాంతాలు ప్రత్యేక దేశంగా చూపించింది. ట్విటర్ ఇలాంటి తప్పు చేయడం వరుసగా ఇది రెండోసారి. గతంలో లేహ్ ప్రాంతం చైనాది అన్నట్టుగా చూపించి తీవ్ర వ్యతిరేకత చవిచూసింది. భారతీయులంతా తీవ్రస్థాయిలో ట్విటర్‌పై విరుచుకుపడ్డారు. అయినా బుద్ధి తెచ్చుకోని ట్విటర్‌.. ఈసారి జమ్మూ కశ్మీర్, లడక్ ప్రాంతాలను ఏకంగా ప్రత్యేక దేశంగా చూపించింది. గతంలో చేసిన తప్పుకే ట్విటర్‌ సీఈఓకు స్ట్రాంగ్‌ లెటర్‌ రాసింది కేంద్రం. ఇలాంటి తప్పులు మళ్లీ జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించింది. అసలే కేంద్ర ప్రభుత్వంతో రెండుసార్లు డెడ్‌లైన్లు పెట్టించుకున్న ట్విటర్.. ఇవాళ చేసిన తప్పుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

Tags

Read MoreRead Less
Next Story