జాతీయం

Karnataka : ఇండియాలో వెలుగుచూసిన రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు.. కర్ణాటకలో ఇద్దరికి పాజిటివ్..!

Karnataka : కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగు చూసాయి. ఇద్దరికీ పాజిటివ్ గా తేలింది.

Karnataka : ఇండియాలో వెలుగుచూసిన రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు.. కర్ణాటకలో ఇద్దరికి పాజిటివ్..!
X

Karnataka : కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగు చూసాయి. ఇద్దరికీ పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. అయితే వారికి స్వల్ప లక్షణాలున్నాయని తెలిపారు. దక్షిణాఫ్రికాకు వెళ్లి బెంగళూరుకు వచ్చిన ఇద్దరు కర్ణాటక వాసులకు ఈ వైరస్ సోకినట్టుగా అధికారులు వెల్లడించారు. వారి వయసు ఒకరికి 66ఏళ్లు కాగా మరొకరు 46ఏళ్ళు.. ప్రస్తుతం వీరిద్దరూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వీరిద్దరూ గత వారం రోజులుగా కలిసిన వ్యక్తుల డేటాను అధికారులు వెతికే పనిలో పడ్డారు. కాగా భారత్‌లో వెలుగుచూసిన తొలి ఒమిక్రాన్ కేసులు ఇవే కావడం గమనార్హం.

Next Story

RELATED STORIES