ఇద్దరమ్మాయిలకీ ఒకడే కావాలంట.. అందరూ చూస్తుండగా నడిరోడ్డుమీద..

ఇద్దరమ్మాయిలకీ ఒకడే కావాలంట.. అందరూ చూస్తుండగా నడిరోడ్డుమీద..
ఒక రాధ ఇద్దరు కృష్ణులు సినిమా సీన్ రివర్స్.. ఇక్కడ ఒక కృష్ణుడు ఇద్దరు రాధలు.. నడి రోడ్డులో అందరూ చూస్తుండగా..

ఒక రాధ ఇద్దరు కృష్ణులు సినిమా సీన్ రివర్స్.. ఇక్కడ ఒక కృష్ణుడు ఇద్దరు రాధలు.. నడి రోడ్డులో అందరూ చూస్తుండగా ఒకరి మీద ఒకరు పడి మరీ జుట్టు పీక్కుంటున్నారు. నా వాడ్ని నువ్వెగరేసుకుపోతావా అని బాహా బాహీ భారీ ఫైటింగ్ జరిగింది ఇద్దరి మధ్యా. వారిద్దరనీ విడదీసి ఒక్కరికే కదా నేను మనసిచ్చాను అని అందులో ఒకరిని తీసుకుని వెళ్లాడు.

మరొకామె నాకే బుద్ది లేదు లోకంలో ఇంతమంది ఉండగా వీడే కావాలా ఏంటి అని కారెక్కేసి వెళ్లి పోయింది. ఈ విచిత్ర సంఘటన ఝార్ఖండ్‌లోని సరాయకేలాలో జరిగింది. బుధవారం తన బాయ్‌ఫ్రెండ్ వేరొక యువతితో చండర్ బజార్ ప్రాంతంలో తిరుగుతున్నాడని సమాచారం అందుకున్న యువతి హుటాహుటిన అక్కడకు చేరుకుంది.

అతడితో ఉన్న ఆమెను పట్టుకుని నిలదీసింది. ఇద్దరి మధ్య గొడవ మొదలై కొట్టుకునే వరకు వెళ్లింది. ఏ మాత్రం తగ్గట్లేదు ఇద్దరూ.. ఏం చేయాలో పాలు పోలేక యువకుడు అటూ ఇటూ తిరిగి చివరకు వారిద్దరినీ విడదీసి ఒకరిని తీసుకుని వెళ్లాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

Next Story