మనసు మరీ మత్తుగా.. నానీ, హైదరీ స్పెషల్ సాంగ్

మనసు మరీ మత్తుగా.. నానీ, హైదరీ స్పెషల్ సాంగ్
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన 'వి' చిత్రం సెప్టెంబర్ 5 న ఒటిటిలో విడుదలై సందడి చేస్తోంది.

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన 'వి' చిత్రం సెప్టెంబర్ 5 న ఒటిటిలో విడుదలై సందడి చేస్తోంది. ఈ చిత్రంలో నాని ప్రతినాయకుడి పాత్ర చిత్రానికే హైలెట్ గా నిలిచింది. అలాగే ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి రెండు సరికొత్త వీడియోలను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. మనసు మరీ మత్తుగా పాట వీడియో గ్లిమ్స్ తో పాటు నానీ యాక్షన్ సీన్స్ కు సంబంధించిన ఓ డైలాగ్ ప్రోమోను చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకుంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నానీకి జంటగా అదితీ రావు హైదరీ, సుధీర్ కు జంటగా నివేదా థామస్ నటించారు. ఇది నానీ 25వ చిత్రం.

Tags

Read MoreRead Less
Next Story