Uma Bharathi: మధుశాలలో గోశాల....

Uma Bharathi: మధుశాలలో గోశాల....
మధ్యప్రదేశ్ లో కొత్త మద్యపాన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తోన్న ఉమాభారతి...
ప్రభుత్వం కొత్త మద్యపాన పాలసీ ప్రవేశపెట్టకపోతే రాష్ట్రంలోని మద్య దకాణాలన్నింటినీ గోశాలలుగా మార్చేస్తానని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి ప్రకటించారు. రాష్ట్రంలో మద్యపానం వల్ల మహిళలపై హింస పెరిగిపోతోందని ఆమె దుయ్యబెట్టారు. రాజధానిలోని అయోధ్యానగర్ లో దేవాలయం పక్కనే వెలసిన మద్యం దుకాణం వద్దకు చేరుకున్న ఉమా భారతి... ప్రభుత్వం కొత్త మద్యపాన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. గత నాలుగు రోజులుగా దేవాలయంలోనే ఉన్న ఆమె ప్రభుత్వం నుంచి ఏ స్పందనా రాకపోవడంతో మధుశాలలో గోశాల అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మద్య దుకాణాలన్నింటిలోనూ గోవులకు ఆశ్రయం కల్పించే పనిని ప్రారంభించారు. నివారి జిల్లాలోని రాజసర్కార్ దేవాయలం వద్ద వెలసిన అక్రమ మద్య దుకాణంతో ఈ యజ్ఞాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. తొలుత అక్రమ దుకాణాలే లక్ష్యంగా ఈ కర్యక్రమం మొదలవ్వబోతోందని తెలుస్తోంది. సరికొత్త లక్కర్ పాలసీ వచ్చే వరకు కూడా నిరీక్షించేది లేదని ఉమాభారతి స్పష్టం చేశారు. ఓర్చాలోని అక్రమంగా నిర్మించిన మద్యం దుకాణం వద్ద 11 ఆవులను ఏర్పాటు చేయమని ఉమా కార్యకర్తలకు సూచించారు. తనను ఎవరు ఆపగలో చూస్తానని, లిక్కర్ దుకాణం ముందరే వాటి కోసం ఆహారం, మంచినీళ్లు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story