Karnataka: పగబట్టిన పాము.. ఆ కుటుంబంలో 12 మంది..

Karnataka: పగబట్టిన పాము.. ఆ కుటుంబంలో 12 మంది..
Karnataka: పాములు ప్రతీకారం తీర్చుకుంటాయని నమ్ముతుంటారు కొంతమంది. ఇలాంటి సంఘటనలు వింటే నిజమేనేమో అని అనిపించకమానదు.

Karnataka: పాములు ప్రతీకారం తీర్చుకుంటాయని నమ్ముతుంటారు కొంతమంది. ఇలాంటి సంఘటనలు వింటే నిజమేనేమో అని అనిపించకమానదు.గత కొంతకాలంగా ఓ కుటుంబాన్ని పాములు వెంటాడుతున్నాయి. అది కూడా నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి కుటుంబ సభ్యులను వేటాడి కాటు వేస్తుంది. ఇప్పటి వరకు వారి కుటుంబంలో 12 మంది పాము కాటుకు గురయ్యారు. వారిలో కొందరు చనిపోయారు. ఈ వింత ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

రాష్ట్రంలోని తుమకూరు జిల్లా తొగరిఘట్ట గ్రామంలో ధర్మన్న ఉమ్మడి కుటుంబం నివాసం ఉంటోంది. ఈ కుటుంబంలోని ఒక వ్యక్తి ప్రతి 4-5 సంవత్సరాలకు ఒకసారి పాము కాటుకు గురవుతాడు. గత 25 ఏళ్లుగా ఇదే జరుగుతోంది. ధర్మన్న ఉమ్మడి కుటుంబంలో ఇప్పటి వరకు 12 మంది పాముకాటుకు గురయ్యారు. వారిలో ఐదుగురు చనిపోయారు. మృతులంతా పురుషులే కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతకుముందు హనుమంతప్ప, వెంకటేష్, శ్రీనివాస్‌తోపాటు కుటుంబ పెద్ద ధర్మాన మృతి చెందారు. ఇటీవల గోవిందరాజు మృతి చెందాడు. అయితే మృతులంతా ఒకే చోట పాము కాటుకు గురికావడం విచిత్రం.

ఇటీవల ఆగస్టు 15న పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన గోవిందరాజు పాముకాటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులతో పాటు పొలంలో పనిచేసే కూలీలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. పొలం వైపు నడవడం మానేశారు. పాము శాంతించేందుకు రాహు, కేతువుల ప్రార్థనలు కూడా ఫలించలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

తరుచూ పాముకాటుకు గురై మరణాలు సంభవిస్తుండడంతో తమ కుటుంబంలో భయాందోళనలు నెలకొన్నాయని మృతుడు గోవిందరాజు భార్య కమలమ్మ తెలిపారు. ఎవరైనా తమ సమస్యను పరిష్కరిస్తే వారికి జీవితాంతం రుణపడి ఉంటామని అంటున్నారు.

ధర్మన్న ఒక రోజు తన పొలం సమీపంలోని పెద్ద చెట్టును నరికివేశాడు. అయితే అప్పటి నుంచి కుటుంబ సభ్యుల్లో ఒకరిని పాము కాటు వేయడం జరుగుతోంది. స్థానిక మునియప్ప ఆలయంలో పాము పగ తీర్చుకునేందుకు గ్రామస్తులు నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. కానీ అవేవీ ఫలించినట్లు అనిపించడంలేదు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి కుటుంబంలోని వ్యక్తి పాముకాటుకు బలవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story