Union Budget: కేంద్ర బడ్జెట్‌కు కౌంట్ డౌన్

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు అందించే మొత్తాన్ని పెంచే యోచనలో కేంద్ర సర్కార్ ఉన్నట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పీఎం కిసాన్ యోజన కింద సంవత్సరానికి 6 వేల ఆర్థిక సహాయం రైతులకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. మూడు విడతల్లో రెండు వేల చొప్పున అందజేస్తున్నారు. అయితే పీఎం కిసాన్ మొత్తాన్ని ఈసారి బడ్జెట్‌లో ఎనిమిది నుంచి పన్నెండు వేలకు పెంచే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని పెంచడంతో రైతులకు మేలు జరుగుతుందని, అయితే ఇది ఆదాయ వ్యయాలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు అనే సవాళ్లతో కూడుకున్నదని, అందుకే పెంపు స్వల్పంగా ఉండవచ్చని అధికారులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com