సాయంత్రం కేంద్ర కేబినెట్ విస్తరణ.. స్మృతి ఇరానీని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం..!

సాయంత్రం కేంద్ర కేబినెట్ విస్తరణ..  స్మృతి ఇరానీని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం..!
X
సాయంత్రం జరిగే కేంద్ర కేబినెట్ విస్తరణపై కసరత్తు పూర్తి చేశారు ప్రధాని మోదీ. కొత్తగా 22 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు.

సాయంత్రం జరిగే కేంద్ర కేబినెట్ విస్తరణపై కసరత్తు పూర్తి చేశారు ప్రధాని మోదీ. కొత్తగా 22 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. వచ్చే ఏడాది జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. మంత్రుల పనితీరు ఆధారంగా భారీగా ప్రక్షాళన జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో పలువురికి ఉద్వాసన.. అలాగే కొందరు మంత్రుల శాఖల మార్పు జరిగే ఛాన్స్‌ ఉంది...సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరగనుంది..మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత జరగుతున్న తొలిసారి కేబినెట్ విస్తరణ ఇది.

వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ....ప్రాంతీయ,రాజకీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది.. తెలంగాణ నుంచి సోయం బాపురావు, ఏపీ నుంచి జీవీఎల్ పేర్లు వినిపిస్తున్నాయి. విస్తరణలో యూపీకి అధిక ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది...యూపీ నుంచి ప్రస్తుతం ఉన్న మంత్రుల స్థానంలో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వనున్నారు..రీటా బహుగుణ జోషి,అజయ్ మిశ్రాకు మంత్రిపదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. వరుణ్ గాంధీ, రాంశంకర్ కటేరియా, సకల్ దీప్ రాజ్ భర్...పంకజ్ చౌదరి, రాజ్ వీర్ సింగ్, అప్నా దళ్ నేత అనుప్రియా పాటిల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి...జ్యోతిరాదిత్య సింధియా,సర్బానంద సోనోవాల్, సుశీల్ మోడీ, నారాయణరానే కేబినెట్ బెర్త్ ఖరారు ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది.

ఇక స్మృతి ఇరానీని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం కనిపిస్తోంది. మాయావతి, ప్రియాంక గాంధీలను ఎదుర్కొనేందుకు ఆమెకు యూపీలో ముఖ్యమైన భాద్యతలు అప్పగించే అవకాశం ఉంది.. ఇక సదానంద గౌడను తప్పించనున్నట్లు తెలుస్తోంది.. ఇక బెంగాల్ నుంచి శాంతను ఠాకూర్ ,నిశిత్ ప్రామాణిక్... మహారాష్ట్ర నుంచి నారాయణ్ రానే, హీనా గవిట్, ప్రీతమ్ ముండే పేర్లు వినిపిస్తున్నాయి. హరియనా నుంచి బ్రిజేంద్ర సింగ్, మధ్యప్రదేశ్ నుంచి రాకేష్ సింగ్, ఒడిశా నుంచి అశ్విని వైష్ణవ్, రాజస్థాన్ నుంచి రాహుల్ కాస్వా పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

ఉత్తరాఖండ్ నుంచి మాజీ సీఎం తీరథ్ సింగ్ రావత్, కర్ణాటక నుంచి నారాయణస్వామి,రమేష్ జిగ జినగి, తమిళనాడు నుంచి మిత్రపక్షం అన్నాడీఎంకే సభ్యులకు ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది...జేడీయూ నుంచి రాజీవ్ రంజన్, ఆర్సీపీ సింగ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి..ఎల్జేపీ చీలిక వర్గం నేత పశుపతి పరాస్‌, లద్ధాఖ్ ఎంపీ జమ్యాంగ్ సెరింగ్‌ కేబినెట్ బెర్తు దక్కే ఛాన్స్ ఉంది.

Tags

Next Story