Monkeypox Allert: మంకీపాక్స్ అలెర్ట్.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదలచేసిన జాబితా..

Monkeypox Allert: మంకీపాక్స్ అలెర్ట్.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదలచేసిన జాబితా..
Monkeypox Allert: మంకీపాక్స్‌ను నివారించే ప్రయత్నంలో, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రజలకు చేయవలసిన మరియు చేయకూడని పనుల జాబితాలను విడుదల చేసింది.

Monkeypox Allert: మంకీపాక్స్‌ను నివారించే ప్రయత్నంలో, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రజలకు చేయవలసిన మరియు చేయకూడని పనుల జాబితాలను విడుదల చేసింది. మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైరల్ జూనోటిక్ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా కొన్ని సూచనలు చేసింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ.

మనుసుఖ్ మాండవియా నేతృత్వంలోని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంకీపాక్స్‌కు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు సంకల్పించారు. మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ పేజీలో ఒక చిత్రాన్ని పంచుకుంటూ, "మంకీపాక్స్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు మీరు ఏమి చేయాలో మరియు చేయకూడదో తెలుసుకోండి." అని పేర్కొన్నారు.

ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ వ్యాధి సోకిన వ్యక్తితో సుదీర్ఘకాలం పరిచయం ఉంటే వారికి మంకీపాక్స్‌ వస్తుంది.

వ్యాధి సోకిన రోగులను ఇతరుల నుండి దూరంగా ఉంచాలి.

మీ చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రం చేసుకోండి లేదా హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించండి.

వ్యాధి సోకిన వ్యక్తుల దగ్గర ఉన్నప్పుడు, మాస్క్‌లు, డిస్పోజబుల్ గ్లోవ్స్ ధరించండి.

పర్యావరణ పరిశుభ్రత కోసం క్రిమిసంహారక మందును ఉపయోగించండి.

చేయకూడనివి

మంకీపాక్స్ సోకిన వ్యక్తుల వస్తువులు వాడకపోవడం మంచిది.

వ్యాధి సోకిన వారి దుస్తులు ఇతరుల దుస్తులతో కలపవద్దు.

మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే పబ్లిక్ ఈవెంట్‌లకు హాజరు కావద్దు.

మంకీపాక్స్ లక్షణాలు

WHO సలహా ప్రకారం, మంకీపాక్స్ లక్షణాలు.. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, తక్కువ శక్తి, చర్మంపై దద్దుర్లు. దద్దుర్లు సాధారణంగా జ్వరం ప్రారంభమైన మొదటి లేదా మూడవ రోజున మొదలవుతాయి. మంకీపాక్స్ ఉన్న రోగికి శరీరం మీద చిన్న చిన్న పొక్కులు ప్రారంభం అవుతాయి. తర్వాత పైపొర, ఎండిపోయి, రాలిపోతాయి.

"దద్దుర్లు నోరు, కళ్లు, ముఖం, అరచేతులు, పాదాల అరికాళ్ళు, జననేంద్రియాలపై కూడా కనిపిస్తాయని WHO హెచ్చరించింది.

ఇప్పటి వరకు భారత్‌లో ఎనిమిది వైరస్ కేసులు నమోదవ్వగా, ఒక మరణం సంభవించడం గమనార్హం. ముఖ్యంగా, నమోదైన 8 కేసులలో, ఐదు కేసులు, ఒక మరణం కూడా కేరళలోనే సంభవించింది. మూడు కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story