కాలికి గాయం తగిలిన తర్వాత మమతకు నొప్పి తెలుస్తోంది: అమిత్‌షా

బెంగాల్‌లో పాగా వేయడమే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీ.. ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. అగ్రనేతలు వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. రాణీబంధ్ సభలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. నందిగ్రామ్ ఘటన మమతపై జరిగిన దాడి కాదని ఎన్నికల సంఘం తేల్చిందని అన్నారు. మమత హయాంలో 130 మంది చనిపోయారని గుర్తుచేశారు. కాలికి గాయం తగిలిన తర్వాత మీకు నొప్పి తెలుస్తోంది అంటూ విమర్శించారు. అటు.. ఇటీవలే టీఎంసీలో చేరిన కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా కు ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ ఉపాధ్యక్షుడిగా, పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా అధినాయకత్వం నియమించింది. కాగా మార్చి 27 నుంచి ఎనిమిది దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెలువడనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com