Krishnam Raju: కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి..

Krishnam Raju: కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి..
Krishnam Raju: దివంగత నటుడు, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరామర్శించారు.

Krishnam Raju: దివంగత నటుడు, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరామర్శించారు. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన నేరుగా కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. అక్కడ కృష్ణంరాజు సతీమణి శ్యామల, ఆయన కుమార్తెలను, ప్రభాస్‌ను పరామర్శించారు. కుటుంబానికి తన ప్రగాఢసానుభూతి తెలియజేశారు. అనంతరం క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆయన వెంట ఉన్నారు.

Tags

Next Story