బ్రేకింగ్.. కేంద్రమంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ కన్నుమూత

బ్రేకింగ్.. కేంద్రమంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ కన్నుమూత
ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాశ్వాన్‌ తుదిశ్వాస విడిచారు

కేంద్రమంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ కన్నుమూశారు. ఇటీవలే గుండె ఆపరేషన్‌ చేయించుకున్న పాశ్వాన్‌... ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌... ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 1946 జులై 5న బీహార్‌లోని ఖగారియాలో జన్మించిన పాశ్వాన్‌... 8 సార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పాశ్వాన్‌.... ఆరుసార్లు కేంద్రమంత్రిగా పని చేశారు. రైల్వే, కార్మిక శాఖతో పాటు అనేక శాఖలు నిర్వహించారు. గతంలో జనతాపార్టీ, జనతాదళ్‌లో భాగస్వామిగా పని చేశారు. లోక్‌జనశక్తి పార్టీని స్థాపించిన పాశ్వాన్‌... దేశంలోని ప్రముఖ దళిత నేతల్లో ఒకరిగా పేరుగాంచారు.

Tags

Next Story