ఇవాళే బాధ్యతలు చేపట్టనున్న కేంద్ర మంత్రులు..!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేటాయించిన శాఖల బాధ్యతలు త్వరగా చేపట్టాలన్న ప్రధాని మోదీ ఆదేశాల మేరకు.. కేంద్ర మంత్రులు ఇవాళే బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ ప్రధాని నివాసంలో కొత్త మంత్రులతో 2 కీలక భేటీలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు కేబినెట్ సమావేశం.. 7 గంటలకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహిస్తున్నారు. కేబినెట్ 2.0లో అమిత్‌షాకు అదనంగా సహకార శాఖ కేటాయించారు. అటు.. మాండవీయకు ఆరోగ్యశాఖ.. సమాచార శాఖ అనురాగ్‌కు దక్కింది. విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్.. సింధియాకు పౌరవిమానయానం కేటాయించారు. కిరణ్ రిజుజుకు న్యాయశాఖ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు.. పదోన్నతిపై 3 శాఖల బాధ్యతలు కిషన్‌రెడ్డి చేపడుతున్నారు. రాజ్‌నాథ్, గడ్కరీ మినహా కొందరు సీనియర్ల ఉద్వాసన వెనుక లెక్కేంటనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com