UP: బలవంతంగా ముద్దుపెట్టబోతే... కొరికిపారేసింది...

UP: బలవంతంగా ముద్దుపెట్టబోతే... కొరికిపారేసింది...
బలవంతంగా ముద్దుపెట్టబోతే... పెదాలను గట్టిగా కొరికేసిన మహిళ; అత్యాచారయత్నాన్ని ధైర్యంగా తిప్పికొట్టిన వీరవనిత..

అత్యాచారం చేసేందుకు య‌త్నించిన ఓ యువకుడికి తగిన బుద్ధి చెప్పింది ఓ యువతి. బలవంతంగా లిప్‌కిస్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే అతని పెదాలను గట్టిగా కొరికేసింది. దీంతో ఆ యువకుని కింది పెదవి తెగి పడిపోయింది. ఈ ఘటన యూపీలోని మీరట్‌ లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు మీర‌ట్‌లోని ద‌రౌలా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఓ గ్రామానికి చెందిన మ‌హిళ తన పొలానికి వెళ్లింది. ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. తన వద్దకు వెళ్లి బలవంతంగా పొదల్లోకి లాక్కెల్లాడు. అత్యాచారానికి యత్నించాడు. ఈ క్రమంలో పెదాలకు ముద్దుపెడుతుండగా సదరు మహిళ పెదాలను పళ్లతో గట్టిగా కొరికింది. దీంతో ఆ యువకుడి కింది పెదవి తెగింది. మహిళ అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకొని యువకుడిని బంధించారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. ఆ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story