UP: కొడుకు పొమ్మంటే ఊరుకుంటానా..! ఆస్తి ప్రభుత్వానికి రాసిచ్చేశా...

UP: కొడుకు పొమ్మంటే ఊరుకుంటానా..! ఆస్తి ప్రభుత్వానికి రాసిచ్చేశా...
కొడుకు నిరాదరణకు గైరన ముదుసలి; కోపంతో కోటిన్నర ఆస్తి ప్రభుత్వానికి ధారదత్తం

చివరి దశలో ఉన్న తనకు అన్నీ తానై సాకాల్సిన కన్న కొడుకే... తనని అన్యాయంగా ఇంటి నుంచి గెంటేశాడు. ఓల్డేజ్ హోమ్ లో తలదాచుకుంటోన్న సదరు ముదుసలి తన తలరాత ఇంతే అనుకోలేదు. కన్నవారిపై ఇసుమంతైనా ప్రేమలేని కొడుక్కి తన ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మొత్తం ప్రభుత్వానికి ధారాదత్తం చేసేశాడు. సుమారు కోటిన్నర రూపాయిలు విలువ చేసే ఆస్తిని తృణప్రాయంగా వదులుకున్నాడు.

ఉత్తర్ ప్రదేశ్ లోని ముజాఫర్ నగర్ కు చెందిన నాథుసింగ్ (85) ఓ రైతు. అతడికి ఓ కుమారుడు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. అమ్మాయిలందరికీ పెళ్లిళ్లు చేసి పంపాడు. కుమారుడు స్కూల్ టీచర్ గా స్థిరపడ్డాడు. తాను చేయవలసిందంతా చేసి, కాస్త విశ్రాంతి తీసుకోవాల్సిన దశలో సహధర్మచారిణి మరణంతో నాథూ సింగ్ పరిస్థితి తలకిందలు అయింది. భార్య చనిపోవడంతో ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఒంటరిగానే జీవిస్తున్న తనని కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా పరామర్శించేందుకు రాలేదని మధనపడ్డాడు. కొడుకూ, కోడలూ తనని చిన్న చూపు చూస్తుండటంతో ఇక జీవితం మీద విసుగు చెందిన నాథూ సింగ్ అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాడు. తన స్వార్జితమైన కోటిన్నర రూపాయిలు విలువ చేసే ఆస్థిని ప్రభుత్వానికి ధారదత్తం చేసేశాడు. తన పేరున స్థలాన్ని ప్రభుత్వం పేరిట మార్చేశాడు. తన మరణానంతరం ఆ స్థలంలో ప్రభుత్వ ఆసుపత్రిగానీ, పాఠశాలగానీ నిర్మించాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు. అంతేకాదు మరణానంతరం తన శవాన్ని కూడా కుంటుబసభ్యులకు అప్పగించవద్దని, దాని బదులు యువ వైద్యుల కోసం తన పార్ధివ దేహాన్ని వినియోగించాల్సిందిగా కోరాడు. ప్రభుత్వం సైతం నాథూ సింగ్ విన్నపం మేరకు పత్రాలు సిద్ధం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story