UP : చిన్నారిపై ఎద్దు దాడి

UP : చిన్నారిపై ఎద్దు దాడి
నాలుగేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా అటువైపు నుంచి వచ్చిన ఎద్దు, చిన్నారిపై కొమ్ములతో దాడి చేసింది

హైదరాబాద్ కుక్కల దాడిలో ఓ చిన్నారి మృరణించిన ఘటన మరువకముందే అలీఘర్ లోని మరో చిన్నారిపై ఎద్దు దాడిచేసింది. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా అటువైపు నుంచి వచ్చిన ఎద్దు, చిన్నారిపై కొమ్ములతో దాడి చేసింది. రెండు అడుగుల దూరంలో చిన్నారిని నెట్టేసింది. ఆపై చిన్నారిపై కూర్చోడానికి చూసింది. వెంటనే స్పందించిన చిన్నారి కుటుంబ సభ్యులు ఎద్దును అధిలించి బిడ్డను రక్షించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని థానా గాంధీ పార్క్ ప్రాంతంలోని ధనిపూర్ మండిలో జరిగింది.

చిన్నారికి ప్రస్తుతం హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఎద్దును పట్టుకునేందుకు వెదుకుతున్నారు. ఎద్దులు విచ్చలవిడిగా రోడ్లపై సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story