UP : అయోధ్యలో మసీదు నిర్మాణానికి పనులు ప్రారంభం

అయోధ్యలో మసీదు నిర్మాణానికి రెడీ అవుతోంది. ధనీపూర్‌లో మసీదు నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ వారంలో జరిగే అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఐఐసీఎఫ్ ప్రతినిధి తెలిపారు. తొలుత స్థలం వేరేచోట కేటాయించడం, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం కొంత జాప్యం జరిగిందని చెప్పారు.
ధనీపూర్ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతను ఐఐసీఎఫ్ ట్రస్టుకు ఉత్తరప్రదేశ్ సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డు అప్పగించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మసీదు నిర్మాణం కోసం ధనిపూర్‌లో 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు యూపీ ప్రభుత్వం ఇచ్చింది. 3 వేల 500 చదరపు మీటర్లలో మసీదు నిర్మాణ చేపట్టనుంది. మసీదు స్థలంలో నాలుగు అంతస్థుల సూపర్ స్పెషాలిటీ ఛారిటీ హాస్పిటల్, 24 వేల 150 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కమ్యూనిటీ కిచెన్, 500 చదరపు మీటర్లలో ఒక మ్యూజియం, 2 వేల 300 చదరపు మీటర్లలో ఇండో-ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్‌ను కూడా నిర్మించనున్నారు. మసీదుకు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మౌల్వి అహ్మదుల్లా షా పేరు పెట్టనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com