UP : జైల్లో గ్యాంగ్ స్టర్... ఆకలి దప్పికలతో కుక్క మరణం

గ్యాంగ్ స్టర్, రాజకీయనాయకుడు అతిక్ అహ్మద్ జైలులో ఉన్నాడు. అతని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెంపెడు కుక్కలు ఆకలికి అలమటిస్తున్నాయి. గ్రేట్ డేన్ జాతి బ్రూనో అనే శునకం ఈ రోజు మరణించింది. అతిక్ ప్రస్తుతం గుజరాత్ లోని సబర్మతి జైలులో ఉన్నాడు. అతిక్ ఇంట్లో ఐదు విదేశీ జాతి కుక్కలు ఉన్నాయి. అతను జైలుకు వెళ్లినప్పటినుంచి వాటికి ఆహారం ఇచ్చే వాళ్లు లేరు. ప్రస్తుతం ఒక కుక్క మరణించగా మిగిలిన నాలుగు కుక్కల పరిస్థితి అలాగే ఉందని స్థానికులు తెలిపారు. వాటికి ఆహారం పెడితే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలో తెలియదని స్థానికులు చెప్పారు.
ఎవరీ అతిక్ అహ్మద్..?
2005లో బహుజన్ సమాజ్ వాద్ పార్టీకి ( బీఎస్పీ) చెందిన ఎమ్మెల్యే రాజుపాల్ హత్య జరిగింది. అందులో ఉమేష్ పాల్ సాక్షిగా ఉన్నాడు. ఉమేష్ పాల్ ను కూడా ఫిబ్రవరి 24 2023న హత్య చేశారు. ఉమేష్ పాల్ కేసులో అతిక్ అహ్మద్ నిందితుడు.
మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ తమ్ముడు అజీమ్ అహ్మద్ ను రాజు పాల్ ఎన్నికలలో ఓడించాడు. గెలిచిన నెలల తర్వాత రాజుపాల్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అతిక్ నిందితుడు. ఉత్తర్ ప్రదేశ్ జైలుకు తరలిస్తే ఎన్ కౌంటర్ లో చనిపోతానన్న భయంతో అతిక్ సుప్రీం కోర్టును ఆశ్రయించి గుజరాత్ జైలులో ఉంటున్నాడు. అతిక్ సోదరుడు అష్రఫ్ కూడా ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీ జైలులో ఉంటున్నాడు. తనను కూడా జైలు నుంచి తరలిస్తే చంపేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్, అసద్ కు యూపీ పోలీసులు రూ.2.5 లక్షల రివార్డును కూడా ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com