Uttar Pradesh: అతిధుల ముందు పెళ్లికొడుకు చేసిన పని.. ఆగ్రహంతో పెళ్లికూతురు

Uttar Pradesh: స్నేహితులతో పందెం కాసాడు. కాబోయే భార్య ఆ విషయాన్ని సరదాగా తీసుకుంటుందనుకున్నాడు. కానీ నీలాంటి వాడిని పెళ్లే చేసుకోను పొమ్మంది పెళ్లి కూతురు. ఇంతకీ అతడేం చేశాడు.. ఆమెకి ఎందుకంత కోపం వచ్చిందో తెలుసుకుందాం..
300 మంది అతిథుల సమక్షంలో వరుడు తనను ముద్దుపెట్టుకోవడంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వధువు పెళ్లిని నిలిపివేసింది. ఆమె అతని ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసింది. వరుడు తన స్నేహితులతో కలిసి బెట్టింగ్‌లో గెలవడానికి తనను ముద్దుపెట్టుకున్నాడని చెప్పింది.
వరుడు తనను అనుచితంగా తాకాడని, అయితే మొదట పట్టించుకోలేదని వధువు ఆరోపించింది. "అతను నన్ను ముద్దుపెట్టుకున్నప్పుడు, నేను అవమానంగా భావించాను. అతను నా ఆత్మగౌరవం గురించి పట్టించుకోలేదు. అతిథుల ముందు తప్పుగా ప్రవర్తించాడు" అని ఆమె మీడియాకు వెల్లడించింది.
పోలీసులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినా వధువు ఒప్పుకోలేదు. పెళ్లి ఆగిపోయింది, అతిథులు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.
పెళ్లికూతురు తల్లి మాట్లాడుతూ.. "వరుడు అతని స్నేహితుల మాట విని రెచ్చిపోయాడని. నా కుమార్తెను ఒప్పించే ప్రయత్నం చేశాం, కానీ ఆమె పెళ్లికి నిరాకరించింది. మేము కొన్ని రోజులు వేచి ఉండాలనుకుంటున్నాము. అందుకే పెళ్లిని వాయిదా వేశాము అని చెప్పింది.
ఘటన జరిగిన సమయానికి వివాహానాకి సంబంధించిన ఆచార వ్యవహారాలు పూర్తయ్యాయి కాబట్టి ఈ జంట పెళ్లి చేసుకున్నారని, రెండు రోజులు వేచి చూసిన తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తామని పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com