Yogi Adityanath : సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం..!

Yogi Adityanath : అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలో ఉన్న టైంలో ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని కోటిమంది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. మాజీప్రధాని, దివంగతనేత వాజ్‌పేయీ జయంతి రోజు డిసెంబర్ 25న తొలిదశ పంపిణీని ప్రారంభించబోతున్నారు. మొదటవిడతలో భాగంగా 60వేల స్మార్ట్‌ఫోన్లు, 40వేల ట్యాబ్‌లను సీఎం యోగి ఆదిత్యనాథ్ యువతకు అందజేస్తారు. MA, BA, BSC, ITI, MBBS, బీటెక్, ఎంటెక్ సహా ఇతర కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకువ వీటిని ఇస్తారు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా వీటిని పంపిణీ చేస్తున్నట్టు యూపీ ప్రభుత్వం తెలిపింది.
మొదటి విడతలో పంపిణీ చేయబోయే ఫోన్లు, ట్యాబ్ ల కోసం 2వేల 35 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది యూపీ ప్రభుత్వం. ఒక్కో ఫోన్ ను 10వేల 700 రూపాయలు... ట్యాబ్ ను 12వేల 600 రూపాయలకు కొనుగోలు చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో యువతకు ల్యాప్‌టాప్‌లు కూడా ఇవ్వలేదని... ఆయనకు ఇప్పటికీ ల్యాప్‌టాప్ ఎలా వాడాలో తెలియదంటూ ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీసీఎం అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. అలాగే, గతంలో తాము పంపిణీ చేసిన ల్యాప్‌టాప్‌లే ఇప్పటికీ పనిచేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో యోగి ప్రభుత్వం ఏకంగా కోటి మందికి స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com