కరణ్ కడుపులో మేకులు.. డాక్టర్లు షాక్

ఉత్తరప్రదేశ్ ఉన్నావ్‌లోని భత్వా గ్రామానికి చెందిన కరణ్ కడుపులో ఉన్న మేకులు, స్క్రూడ్రైవర్‌ని చూసి డాక్టర్లు షాకయ్యారు. ఇదేంటయ్యా బాబు ఆకలేస్తే అన్నం తినాలి.. అన్నం ఇష్టం లేకపోతే, ఏ పండ్లో తినాలి.. అది ఇదీ కాదని ఈ మేకులు, సూదులు తినడం ఏమిటి.. ఇదేం అలవాటు.. అని అడిగినా అతడి నోట మాట లేదు. అయినా పిల్లాడు ఏం చేస్తున్నాడో కనిపెట్టుకుని ఉండవలసిన బాధ్యత మీకు లేదా అని తండ్రినీ నిలదీశారు వైద్యులు. మొత్తానికి మూడు గంటలు సర్జరీ చేసి కడుపులో ఉన్న వస్తువులను బయటకు తీశారు. కొన్ని సంఘటనలు వినడానికి వింతగా ఉన్నా కళ్లముందు కనిపిస్తుంటే నమ్మక తప్పదు. కొందరు సుద్దముక్కలు, మట్టి తింటారు. కడుపులో నులిపురుగులు వుంటే ఇలాంటివి తింటారని చెబుతుంటారు డాక్టర్లు. మరి ఈ అబ్బాయి ఇనుప వస్తువులు తిన్నాడు అంటే అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించారు వైద్యులు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com